📄 ePaper
Thursday, March 12, 2026
ADS
HomeNewsచదువుకున్న మహర్లు చట్టసభల్లో వెళ్ళాలి

చదువుకున్న మహర్లు చట్టసభల్లో వెళ్ళాలి

📰 Generate e-Paper Clip

•అంబేద్కర్ ను మాత్రమే స్పూర్తిగా స్వీకరించండి

  • బుద్ధుని ఆలోచనలను అనుసరించండి
  • సామాజిక విలువలతో బ్రతకండి
  • మహర్ ప్రజా ప్రతినిధుల సభలో సూరన్న

కాగజ్ నగర్,జనవరి,11,మెదక్ టుడే న్యూస్:
కాగజ్ నగర్ పట్టణంలో నిర్వహించిన
మహార్ ప్రజాప్రతినిధుల సభలో సూరన్న మాట్లాడుతూ,కలిసికట్టుగా ఉంటే రాజకీయ పదవులు అనుభవించవచ్చు. ప్రస్తుతం రాజకీయం అంటే దోపిడి దౌర్జన్యాలు అనే రీతిగా మనం చూస్తున్నాం ఇలాంటి తరుణంలో గెలిచిన మనం అభివృద్ధివైపు అడుగులువేసి రానున్న రోజుల్లో మన సామాజిక వర్గాన్ని ముందుకు తీసుకొని వెళ్తూ సమాజాన్ని మార్చే సాధనంగాఉపయోగపడాలన్నారు.బోధించు, సమీకరించు, పోరాడు అని దశాబ్దాలుగా వింటున్నమాటే కానీ కేవలం బోధించడం దాని తర్వాత సమీకరించడం ఆ తర్వాత పోరాడడం మాత్రమే కాకుండా సాధించాలి అనే రీతిగా ప్రయత్నాలు చెయ్యాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.మన సిద్ధాంతం మన ఆలోచనలు మన ప్రవర్తన మన విలువలు ఈ సమాజంలో ప్రతిబింబించాలి అప్పుడే మన కులాన్ని ఇతర కులాలు గౌరవించే అవకాశం ఉంటుందనిఅంబేద్కర్ స్పూర్తి, అంబేద్కర్ లక్ష్యాన్ని మనం అనుసరించి భావి తరాలకు ఆదర్శంగా ఉండేలా జీవన విధానం ఉండాలన్నారు.రాజ్యాంగం కల్పించిన హక్కుల్ని వాడుకోవాలి,ప్రాథమిక హక్కుల్ని వాడుకొని మన స్వేచ్ఛను మనం వినియోగించాలి.మహర్లు ఎవరికి బానిసగా పనిచేయకుండా ఎవరికాళ్ళమీద వారు నిలబడాలి.పే బ్యాక్ టు సొసైటీ లో భాగంగా ఒకరిని ఒకరు ప్రోత్సహించి ముందుకు వెళ్ళాలి. ఎందుకు గెలిచాం.? గెలిచి ఏం చేస్తున్నాం.? దేనికోసం మనం ఉన్నాం.? మన సామాజిక వర్గాన్ని మనం ముందుకు తీసుకొని వెళ్తున్నమా లేదా.? అనే ప్రశ్నలు రోజుకు మూడు సార్లు వేసుకుంటే మనం ఏం చెయ్యాలో మనకు తెలుస్తుంది అని చెప్పుకొచ్చారు.గెలిచిన వార్డు మెంబర్లు,గెలిచిన సర్పంచులను “మీరే రాజులు మీరే ధీరులు మీరే శూరులు ” మీరే వ్యవస్థ మార్పు కొరకు పనిచేయాలి మీ ఆలోచనలే పునాదులవ్వలి అని చెప్పుకొచ్చారు.
ఈ కార్యక్రమంలో బహుముఖ మేధావులు రాజకీయ నాయకులు వివిధ సంఘాల నాయకులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ADS

Most Popular

Recent Comments