అమీన్పూర్,జనవరి,7,(మెదక్ టుడే)న్యూస్:ప్రతినిధి,సంగారెడ్డి జిల్లా బీరంగూడ జిహెచ్ఎంసి పరిధిలోని బీరంగూడ గుట్టపై వెలసిన శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవాలయంలో 118 రోజుల హుండీ లెక్కింపు కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ హుండీ లెక్కింపు కార్యక్రమం పరిశీలకులు ఈఓ శ్రీనివాస్ సమక్షంలో చైర్మన్ సుధాకర్ యాదవ్, ఆలయ ఈవో శశిధర్ గుప్త ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమంలో మహిళా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని హుండీ లెక్కింపులో సహకరించారు.హుండీ లెక్కింపులో మొత్తం రూ.10,04,280 ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈవో శశిధర్ గుప్త తెలిపారు. ఈ మొత్తాన్ని ఆలయ ఖాతాలో జమ చేసి, రాబోయే శివరాత్రి మరియు జాతర ఉత్సవాలకు వినియోగించనున్నట్లు తెలిపారు.చైర్మన్ సుధాకర్ యాదవ్ మాట్లాడుతూ, భక్తుల సహకారంతో పారదర్శకంగా హుండీ లెక్కింపు నిర్వహించామని చెప్పారు. ఆలయ అభివృద్ధి కార్యక్రమాలు, ఉత్సవాల నిర్వహణకు ఈ నిధులను ఉపయోగించనున్నట్లు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో సీనియర్ అసిస్టెంట్ మల్లికార్జున రెడ్డి, ఆలయ ధర్మకర్తల మండలి సభ్యులు దండు రమేష్, చంద్రశేఖర్, లక్ష్మీకాంత్ రావు, దీపక్ గౌడ్, శ్రీనివాస్ జె, ఎల్లయ్య, మహేష్, మహిళా భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

