📄 ePaper
Friday, June 5, 2026
ADS
Home Blog Page 18

చేగుంట రైతు వెదిక లో వ్యవసాయ వారోత్సవాలు.

0

చేగుంట,మే,6,మెదక్ టుడే న్యూస్:చేగుంట మండల కేంద్రంలోని రైతు వేదికలో ప్రజా పాలనలో – ప్రగతి ప్రణాళికలో 99 రోజుల ప్రణాళికలో భాగంగా చేగుంట వ్యవసాయ రైతు వేదికలో మార్కెట్ కమిటీ చైర్మన్ తాడెం వెంగళరావు అధ్యక్షతన అధ్వర్యంలో ఘనంగా రైతు వారోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్ అవకాశాలు, బ్యాంకుల ద్వారా దీర్ఘకాలిక, స్వల్ప కాలిక పంట రుణాలు పైన రైతులకు అవగాహన కల్పించారు. రైతు శ్రేయస్సుకోసం రైతు సంక్షేమాన్ని ప్రజలకు అందిస్తున్న ఏకైక ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే అది కాంగ్రెస్ అని కొనియాడారు. కార్యక్రమంలో తాసిల్దార్ శివప్రసాద్, ఎంపీడీఓ చిన్నారెడ్డి,అగ్రికల్చర్ ,డిసిసిబీ బ్యాంక్ మేనేజర్ శశికాంత్ రెడ్డి, వ్యవసాయ సైంటిస్ట్ డాక్టర్ రామాంజనేయులు, కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు వడ్ల నవీన్ కుమార్,మార్కెట్ కమిటీ డైరెక్టర్ లు, మొహమ్మద్ ముజామిల్, అన్నం ఆంజనేయులు, స్టాలిన్ నర్సిములు, బాల్ రెడ్డి, కాషాబోయిన శ్రీనివాస్, రఫీ, కుర్మ లక్ష్మి, లక్ష్మణ్ , రమేష్ , వివిధ గ్రామాల సర్పంచ్ లు ,క్లస్టర్ వ్యవసాయ అధికారులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.

రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలి తాసిల్దార్ శివప్రసాద్.

0

చేగుంట,మే,6,మెదక్ టుడే న్యూస్:చేగుంట మండలంలోని మక్క రాజుపేట సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని చేగుంట తాసిల్దార్ శివప్రసాద్ పరిశీలించారు. వారు మాట్లాడుతూ రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కొనుగోలు జరిపించాలని, రైతులు అధైర్య పడవద్దు ప్రతి గింజ కొనుగోలు చేస్తాము అని అన్నారు. ఇక్కడికి వచ్చిన రైతులకు అవసరమైన వసతులు కల్పించాలని వారు అన్నారు.

అత్యాషాకు వెళ్ళి ఆర్థికంగా నష్టపోవద్దు,సైబర్ నేరాల నివారణలో అవగాహనే ముఖ్యం-పాపన్న పేట ఎస్ ఐ శ్రీనివాస్ గౌడ్..

0

పాపన్నపేట,మే,6,మెదక్ టుడే న్యూస్: అత్యషకు వెళ్ళి ఆర్థికంగా నష్ట పోవద్దని సైబర్ నేరాలు రోజురోజుకుపెరిగిపోతున్నాయని రైతులు, ప్రజలు అప్రమత్తం గా ఉండాలని పాపన్న పేట ఎస్ ఐ శ్రీనివాస్ గౌడ్ అన్నారు. బుధవారం మండల కేంద్రమైన పాపన్న పేట సుభాష్ చంద్రబోస్ విగ్రహం వద్ద ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా నిర్వహిస్తున్న 99 రోజుల ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా, మెదక్ జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో రైతులు, ప్రజలకు సైబర్ నేరాలు, దుష్ప్రభావాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆధునిక సాంకేతిక యుగంలో సైబర్ నేరాలు రోజురోజుకూ పెరుగుతున్నాయని తెలిపారు. ముఖ్యంగా డిజిటల్ లావాదేవీల వినియోగంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అపరిచితుల నుంచి వచ్చే ఫోన్ కాల్స్, సందేశాలు, ఈ-మెయిల్స్, లింక్‌లను నమ్మవద్దని, వ్యక్తిగత సమాచారం, బ్యాంకు ఖాతా వివరాలు, ఓటీపీ వంటి గోప్యమైన వివరాలను ఎవరికీ చెప్పకూడదని హెచ్చరించారు. అరుగాలం కష్టించి పండించిన ధాన్యం విక్రయించిన డబ్బులు రైతుల ఖాతాల లో ప్రభుత్వం వేయడంతో సైబర్ నేరగాళ్ళు లేని పోనీ లింకులు పంపుతూ, వ్యక్తిగత సమాచారం రాబట్టెందుకు కుతంత్రాలుపన్నుతారనిజాగ్రతగాఉండాలనిసూచించారు . రైతులు తెలిసి తెలియక సైబర్ నేరగాళ్ళ ఉచ్చులో పడి డబ్బులు పొడగొట్టు కుంటున్నారని. ఎవరైనా
సైబర్ మోసాలకు గురైతే వెంటనే 1930 హెల్ప్‌లైన్‌కు ఫోన్ చేయాలని లేదా సమీప పోలీస్ స్టేషన్ ను సంప్రదించాలని సూచించారు.నకిలీ అకౌంట్ల బారిన పడకుండా జాగ్రత్తగా ఉండాలని కోరారు.ఈ కార్యక్రమం లో రైతులు, వివిధగ్రామాల ప్రజలు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

పారదర్శకతతో సంక్షేమ పథకాల అమలు.అభివృద్ధి, సంక్షేమమే మా తొలి ప్రాధాన్యత: ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి.

0

226 మంది లబ్ధిదారులకు రెండు కోట్ల 26 లక్షల రూపాయల విలువైన కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ.

పాల్గొన్న అమీన్‌పూర్ మున్సిపల్ మాజీ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి.

    పటాన్‌చెరు,మే,5,(మెదక్ టుడే) న్యూస్:ప్రతినిధి,అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందిస్తూ పూర్తి పారదర్శక పాలన అందిస్తున్నామని పటాన్‌చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. మంగళవారం పటాన్‌చెరులోని క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో.. రామచంద్రాపురం, పటాన్‌చెరు మరియు అమీన్‌పూర్ రెవెన్యూ మండలాల పరిధిలోని 226 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాల ద్వారా మంజూరైన చెక్కులను ఆయన పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో అమీన్‌పూర్ మున్సిపల్ మాజీ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి ఎమ్మెల్యే తో కలిసి లబ్ధిదారులకు చెక్కులను అందజేశారు. ముఖ్యంగా అమీన్‌పూర్ పరిధిలోని 57 మంది లబ్ధిదారులకు ఈ పథకాల కింద చెక్కులను పంపిణీ చేయడం జరిగింది.ఆడబిడ్డల పెళ్లి భారం కాకూడదనే.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన అనంతరం పేద, బడుగు, బలహీన వర్గాల కుటుంబాలకు ఆడపిల్ల పెళ్లి భారం కాకూడదన్న సమన్నత లక్ష్యంతో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ వంటి విప్లవాత్మక పథకాలను ప్రవేశపెట్టారని గుర్తు చేశారు.ప్రజల ఆర్థిక అభ్యున్నతే లక్ష్యం:పటాన్‌చెరు నియోజకవర్గం వ్యాప్తంగా ప్రజల సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలకు తొలి ప్రాధాన్యత ఇస్తూ వారి ఆర్థిక అభ్యున్నతికి పాటుపడుతున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. నిరంతరం క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ, వాటి పరిష్కారానికి ప్రణాళికాబద్ధంగా నిధులు కేటాయిస్తున్నామని వివరించారు. నియోజకవర్గ అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఆయన విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో అమీన్పూర్ మండల్ ఎమ్మార్వో వెంకటేష్, ఆర్ ఐ సంగీత, స్థానిక ప్రజా ప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, ముఖ్య నాయకులు మరియు లబ్ధిదారులు పాల్గొన్నారు.

    చేగుంట కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ అధ్యక్షులు తొడుపునూరి రాజు దంపతుల 30వ పెళ్లి రోజు వేడుకలు.

    0

    చేగుంట,మే,5,మెదక్ టుడే న్యూస్:చేగుంట మండలం తెలంగాణ రాష్ట్ర కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ ప్రధాన కార్యదర్శి, తెలంగాణ ఫార్మసీ కౌన్సిల్ మెంబర్ మెదక్ జిల్లా కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అధ్యక్షులు శ్రీ తొడుపునూరి రాజు-కవిత దంపతుల 30వ వివాహ వార్షికోత్సవ వేడుకలను మంగళవారం మక్కారాజ్ పెట్ రోడ్ లో గల శ్రీ బాలాజీ ఫంక్షన్ హాల్ లో చేగుంట, చిన్న శంకరంపేట, నార్సింగి ఉమ్మడి మండలాల కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ సభ్యులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా దంపతులు పూలమాలలు మార్చుకోగా అసోసియేషన్ సోదరులంతా కలిసి రాజు దంపతులకు శాలువాతో ఘనంగా సత్కరించి, కేక్ కట్ చేయించారు. అనంతరం దంపతులకు కేక్ తినిపించి శుభాకాంక్షలు తెలుపుతూ, నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆత్మీయంగా పెళ్లిరోజు శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ కార్యక్రమం లో చేగుంట ఏరియా కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ సభ్యులు లక్ష్మీనారాయణ, అయిత రఘురాములు, స్వామి, భాస్కర్, వెంకన్న, కృష్ణమూర్తి, రమణ, ప్రకాష్, నాగేశ్వర్ రావు, సురేష్, భూపాల్, శ్రీనివాస్, శేఖర్,మొయిన్ పాషా, ప్రశాంత్, రమేష్ తదితరులు పాల్గొని సందడి చేశారు.

    వ్యవసాయ రంగంలోఆధునిక పద్ధతులు పాటించాలి.

    0

    చేగుంట,మే,5,మెదక్ టుడే న్యూస్:చేగుంట మండలం చందాయిపేట గ్రామంలోప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వావిద్యాలం ఆధ్వర్యంలో జరుగుతున్న “రైతుల ముంగిట్లో శాస్త్రవేత్తలు” కార్యక్రమలో భాగంగా వ్యవసాయ ఇంజినిరింగ్ కళాశాల కంది మండలం సంగారెడ్డి బోధన సిబంది డాక్టర్ లక్ష్మణ్ రావు ,డాక్టర్ నీమా చేగుంట మండలంలోని చందాయిపేట గ్రామంలో అన్నదాతలకు అవగాహనా కార్యక్రమం నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమంలో డాక్టర్ లక్ష్మణరావు మాట్లాడుతు, పంటలలో యూరియా వినియోగం తగ్గించడం, రసాయన ఎరువుల వినియోగం తగ్గించి జీవ ఎరువులు, పశువుల పెంట వాడడం మరియు సేంద్రియ పద్ధత్తులపై వివరించడం జరిగింది. డాక్టర్ నీమా మాట్లాడుతూ పంట మార్పిడి వల్ల జరిగే మేలు, నీటి ఆదా చేయడం మరియు మార్కెట్లో గిరాకీ ఉన్న వరి పంటలపై చర్చించడం జరిగింది. అలాగే ఈ కార్యక్రమం లో వ్యవసాయ అధికారి హరి ప్రసాద్ మార్కెట్లో డిమాండ్ ఉన్న వరి రకాలు కలుపు యాజమాన్యం గురించి వివరించారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మహేశ్వరీ,ఉప సర్పంచ్ నగేష్, పంచాయతీ సెక్రటరీ కృష్ణ, ఏ ఎం సి డైరెక్టర్ ముజమిళ్, వార్డు మెంబెర్స్, రైతులు, విద్యార్థులు మరియు వ్యవసాయ విస్తరణ అధికారి భువనేశ్వరి తదితరులు పాల్గొన్నారు.

    జన్మదిన పురస్కరించుకుని చలివేంద్రంలో మజ్జిగ పంపిణీ.

    0


    (స్పెషల్ కరస్పాండెంట్)
    నెక్కొండ,మే,5,మెదక్ టుడే న్యూస్:మంగళవారం నాడు ఉదయం 11 గంటలకు ఎస్ఆర్ టెంట్ హౌస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రంలో 100 రోజుల పనిలో పాల్గొంటున్న కార్మికులకు మజ్జిగ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకుని కార్మికులకు చల్లని మజ్జిగ అందించి ఉపశమనం కలిగించారు.ఈ కార్యక్రమానికి నెక్కొండకు చెందిన గాయత్రి దంత వైద్యశాల డాక్టర్ కొమ్ము శ్రవణ్ కుమార్ తమ తమ్ముళ్లు కొమ్ము అభిలాష్ మరియు కీర్తిశేషులు డాక్టర్ కొమ్ము మహర్షి జన్మదినాన్ని పురస్కరించుకుని వారి పేరుమీద చలివేంద్ర నిర్వహణకు ఆర్థిక సహాయం అందజేశారు.ఈ సందర్భంగా డాక్టర్ శ్రవణ్ కుమార్ మాట్లాడుతూ, తమ తమ్ముళ్ల జ్ఞాపకార్థం సమాజానికి ఉపయోగపడే విధంగా సేవా కార్యక్రమాలు నిర్వహించడం ఆనందంగా ఉందని తెలిపారు.
    కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు.

    నూతన సాంకేతిక పద్ధతులను అవలంబించి రైతులు తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆదాయం వచ్చే పంటలు పండించాలి.మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు.

    0

    రైతులను ఆర్థికంగా బలోపేతం చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం

    రైతు సంక్షేమమే ధ్యేయంగా పటిష్ట చర్యలు

    99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక లో భాగంగా మంగళవారం మెదక్ జిల్లా కేంద్రంలోని మాయ గార్డెన్ లో ఉద్యానవన శాఖ అధికారి ప్రతాప్ సింగ్, అధ్యక్షతన నిర్వహించిన ఉద్యానవన పంటల సాగు, ఆయిల్ ఫామ్ సాగు విస్తీర్ణం పెరుగుదల, ప్రత్యామ్నాయ పంటల సాగు పై అవగాహన సదస్సు కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్, మున్సిపల్ చైర్మన్ రాధిక భూపతి రాజు, వైస్ చైర్మన్ దొంతి నరేష్ గౌడ్ , వివిధ ప్రజాప్రతినిధులు అధికారులు రైతులతో కలిసి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే ,రాష్ట్ర గేయాలపనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు.ఈ సందర్బంగా ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతు సంక్షేమమే ధ్యేయంగా రైతులను అన్ని విధాల ఆదుకుంటుందని అన్ని రకాల సబ్సిడీలు ఆర్థిక, ఆధునిక సాంకేతిక రంగంలో నూతన పద్ధతుల ద్వారా వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి పరిచే దిశగా రైతులకు మేలు చేసే విధంగాఅన్ని రకాల చర్యలు తీసుకుంటుంది అన్నారు. రైతులు ప్రయత్నం చేయక పొతే భవిష్యత్తు లో భూమి మొత్తం నిస్థార మవుతుందని,తక్కువ పెట్టుబడి తో ఎక్కువ పంటలు పండించేలా రైతులు ముందుకెళ్లాలని, ఆర్గానిక్ పంటల సాగు పై రైతులు ద్రుష్టి పెట్టాలన్నారు.భూములను రక్షించి ప్రకృతి వ్యవసాయం చేసి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడుకోవాలన్నారు ఆరోగ్య పరిరక్షణ, సమతుల్య ఎరువుల యాజమాన్యం, ప్రకృతి వ్యవసాయం, పై అవగాహనా కలిపించు కోవాలన్నారు.జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ మాట్లాడుతూ… ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమాల్లో భాగంగా రైతు వారోత్సవాల కార్యక్రమాలను జిల్లాలో ఘనంగా నిర్వహిస్తున్నామన్నారు.రైతులు భూసార పరీక్షలు చేయించుకోవాలని, ఓకే పంట కాకుండా పంటల మార్పిడి చేయాలన్నారు. ఒకే పంటతో జరిగిన నష్టాన్ని అధికారులు రైతులకు వివరించాలన్నారు.పండ్లు కూరగాయలు పూలు లతో ఆయిల్ పామ్ పంటలను కూడా పండించడం ద్వారా అధిక లాభాలను అర్జించవచ్చని తెలిపారు. ఆయిల్ ఫామ్ పంటలో ఇతర పంటలను కూడా పండించవచ్చని, కోతుల బెడద నుండి పంటలను కాపాడడానికి ఏర్పాటు చేసుకోవాలని కలెక్టర్ సూచించారు.మున్సిపల్ చైర్మన్ రాధిక భూపతి రాజు మాట్లాడుతూ రైతుల బాగు కోరి ఆయిల్ ఫామ్ పంటను రాష్ట్ర ప్రభుత్వం పరిచయం చేసిందన్నారు ఈ పరిచయం దినదినాభివృద్ధి చెందుతూ. మన జిల్లాలో ఆయిల్ ఫామ్ సాగు చేసేందుకు రైతులు మొగ్గుచూపుతున్నారు అన్నారు.రైతులు ప్రస్తుతం ఉన్న పంటలే కాకుండా ప్రత్యామ్నాయ పంటలపై మొగ్గు చూపుతూ అభివృద్ధి దిశగా ముందుకు పోవాలన్నారు అంతర్ పంటలు వేస్తూ ఆయిల్ ఫామ్ సాగు చేస్తే లాభాలు బేశరతుగా ఉంటాయని ఈ సందర్భంగా వెల్లడించారు.మెదక్ మున్సిపల్ వైస్ చైర్మన్ దొంతి నరేష్ గౌడ్ మాట్లాడుతూ రైతే దేశానికి వెన్నుముక అనే నినాదంతో రాష్ట్ర ప్రభుత్వం రైతుల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతుందని ప్రత్యామ్నాయ ఇతర పంటలపై రైతులు మొగ్గు చూపుతూ సాగు చేస్తూ అధిక లాభాలు ఆర్జించాలని తెలిపారు.అంతకుముందు శాఖ ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలించారు.ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి దేవకుమార్, ఉద్యానవన శాఖ అధికారి ప్రతాప్ సింగ్, కౌన్సిలర్లూ తదితరులు పాల్గొన్నారు.

    కళ్యాణ లక్ష్మి పేదింటి ఆడబిడ్డలకు వరం-చెక్కుల పంపిణీ చేసిన మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్.

    0

    మెదక్,మే,5,మెదక్ టుడే న్యూస్:ప్రతినిధి, రామాయంపేట మండల కేంద్రంలో ని తాసిల్దార్ కార్యాలయంలో మంగళవారం మెదక్ శాసనసభ్యులు మైనంపల్లి రోహిత్ రావు కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు.రామాయంపేట మండలంలో మొత్తం 96 చెక్కలకు గాను 96,11,136 కోట్ల రూపాయల చెక్కులను లబ్ధిదారులకు అందించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కళ్యాణ లక్ష్మి పేదింటి ఆడబిడ్డలకు ఒక వరమని పేద కుటుంబాలపై పెళ్లి భారాన్ని తగ్గించడం కోసమే కల్యాణ లక్ష్మి పథకం రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తుందని అన్నారు.

    మెదక్‌లో జూదంపై పోలీసుల ఉక్కుపాదం-ఐదుగురు అరెస్ట్, రూ. 37,335 స్వాధీనం.

    0

    మెదక్,మే,5,మెదక్ టుడే న్యూస్:ప్రతినిధి.మెదక్ పట్టణంలోని మార్కెట్ ప్రాంతంలో బొమ్మా బొరుసు జూదం ఆడుతున్న వారిపై టాస్క్ ఫోర్స్ పోలీసులు, స్థానిక పోలీసులు సంయుక్తంగా దాడి చేసి ఐదుగురిని అరెస్ట్ చేసినట్లు జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు తెలిపారు. నిందితుల వద్ద నుంచి రూ.37,335 నగదు, 6 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నామని ఆయన పేర్కొన్నారు. అరెస్ట్ అయిన వారు ధర్మకర్ వెంకట్, హుస్సేన్, శేఖర్, రంగారాం, రాజు అని చెప్పారు. ఈ ఘటనపై మెదక్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నామని తెలిపారు. జిల్లాలో ఎక్కడైనా జూద కార్యకలాపాలు నిర్వహించినా కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు.