•ఇందిరమ్మ మహిళా శక్తి చీరల పంపిణీ ని పరిశీలించిన కలెక్టర్ రాహుల్ రాజ్..
•18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి చీరలు అందేలా చూడాలి కలెక్టర్ రాహుల్ రాజ్
చేగుంట నవంబర్ 23 మెదక్ టుడే న్యూస్:
చేగుంట మండల కేంద్రంలోని మండల సముదాయంలో
ఇందిరమ్మ మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమాన్ని మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ పరిశీలించారు ఆదివారం రోజున ఐకెపి ఎపిఎం దుర్గాప్రసాద్ ఆధ్వర్యంలో 3 సెంటర్ల ఏర్పాటు చేశారు.మహిళా సంఘాల నాయకులతో చీరల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ పంపిణీ కార్యక్రమంలో మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ఆకస్మితంగా పరిశీలించి చీరల పంపిణీ విధానం పరిశీలించారు.ఈ సందర్భంగా మహిళా సంఘాల నాయకులతో మాట్లాడి గ్రూపు సభ్యులతో పాటు ఇంట్లో ఉన్న 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి చీరలు అందె ల చూడాలి అన్నారు.గ్రూపులో లేని వారిని గ్రూపులో చేర్చుకొని వారికి కూడా చీరలు ఇవ్వాలని సూచించారు చేగుంట మండలానికి సుమారు పదివేల చీరలు వచ్చాయని అవసరమైతే మరిన్ని చీరలు ఇస్తామని గ్రూపులో ఉన్న తొమ్మిది వేల పై చిలుకు వారికి కాకుండా ఇంకా మిగిలిన వారి పేరు నమోదు చేసుకొని రిపోర్టు ఇవ్వాలని అన్నారు.ఈ కార్యక్రమంలో మహిళా సంఘ నాయకులు,ఏపిఎం దుర్గాప్రసాద్,సొసైటీ చైర్మన్ అయితే రఘురాములు, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వడ్ల నవీన్ కుమార్, ఎస్సీ సెల్ అధ్యక్షుడు సిరిగోజి (స్టాలిన్ )నర్సింహులు యువ నాయకులు సండ్రుగు శ్రీకాంత్,మహిళలు తదితరులు పాల్గొనడం జరిగినది.
