📄 ePaper
Thursday, September 24, 2026
ADS
Homeమెదక్ జిల్లా వార్తలుచేగుంటలో వైభవంగా శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి గణేష్ నిమజ్జనోత్సవం.

చేగుంటలో వైభవంగా శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి గణేష్ నిమజ్జనోత్సవం.

📰 Generate e-Paper Clip

చేగుంటలో వైభవంగా శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి గణేష్ నిమజ్జనోత్సవం.

చేగుంట సెప్టెంబర్ 23 మెదక్ టుడే న్యూస్:చేగుంటమండల కేంద్రంలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయ గణేష్ నిమజ్జన కార్యక్రమం వైభవంగా నిర్వహించారు.కమిటీ సభ్యులు మాట్లాడుతూ.. ఈరోజు ఉదయం గణపతి హోమం, అనంతరం శివపార్వతుల కళ్యాణం జరిగిందని, సాయంత్రం శోభాయాత్ర ప్రారంభమైందని తెలిపారు. గణేష్ శోభాయాత్ర ప్రతిసారిలాగే ఈసారి కూడా ఘనంగా జరిగిందన్నారు.లడ్డూ వేలం పాటలో భక్తులు ఉత్సాహంగా పాల్గొన్నారని, అందులో మొదటి లడ్డూను రూ.51,000లకు గోలి గురుమూర్తి, రెండవ లడ్డూను రూ.17,000లకు తోడుపునూరి మహేష్, మూడవ లడ్డూను రూ.21000లకు నంగునూరి శ్రీనివాస్ దక్కించుకున్నారని తెలిపారు. లడ్డూను దక్కించుకున్న వారికి, వారి కుటుంబ సభ్యులకు గణేశుని దీవెనలు ఎల్లప్పుడూ ఉంటాయని ఆకాంక్షించారు.ఆడపడుచులు కోలాటం ఆడుతూ స్వామివారిని ఊరేగింపుగా తీసుకెళ్లడం విశేషంగా ఆకట్టుకుంది. విద్యుత్ దీపాలతో, పూలతో అలంకరించిన వాహనంపై గణనాథుడిని ఊరేగించారు.ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. భక్తుల జయజయధ్వానాల మధ్య శోభాయాత్ర ఘనంగా కొనసాగింది. తమకు సహకరించిన ప్రతి ఒక్కరికీ కమిటీ సభ్యులు ధన్యవాదాలు తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -ADS

Most Popular