📄 ePaper
Wednesday, September 23, 2026
ADS
Homepatancheru political newsతొలి ఏడాది ₹11 వేలు..నేడు ₹5.30 లక్షలు:

తొలి ఏడాది ₹11 వేలు..నేడు ₹5.30 లక్షలు:

📰 Generate e-Paper Clip

తొలి ఏడాది ₹11 వేలు.. నేడు ₹5.30 లక్షలు:

నారాయణరెడ్డి కాలనీ గణపతి లడ్డూను దక్కించుకున్న బాల్‌రెడ్డి దంపతులు

అమీన్‌పూర్, సెప్టెంబర్ 22:(మెదక్ టుడే) న్యూస్ ప్రతినిధి.సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు నియోజకవర్గ పరిధిలోని అమీన్‌పూర్ డివిజన్ నారాయణరెడ్డి కాలనీలో శ్రీ గణేష్ ఉత్సవాలు అంబరాన్నంటాయి. కాలనీవాసులు, ఉత్సవ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో గత 22 ఏళ్లుగా కొనసాగుతున్న వినాయక నవరాత్రి ఉత్సవాలు ఈ ఏడాది కూడా అత్యంత వైభవంగా ముగిశాయి. నవరాత్రుల్లో భాగంగా 9వ రోజు మధ్యాహ్నం భారీ ఎత్తున మహా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం సాయంత్రం స్వామివారి నిమజ్జన శోభాయాత్రను ఘనంగా ప్రారంభించారు. మహిళల కోలాటాలు, చిన్నారుల నృత్యాలు, భక్తుల భజనలతో ఊరేగింపు కోలాహలంగా సాగింది.లడ్డూ వేలం పాటలో తీవ్ర పోటీ:* శోభాయాత్రకు ముందు నిర్వహించిన గణనాథుడి లడ్డూ వేలం పాట భక్తుల మధ్య రసవత్తరంగా సాగింది. నారాయణరెడ్డి కాలనీతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల భక్తులు సైతం పోటాపోటీగా పాల్గొన్నారు. చివరకు కాలనీకి చెందిన చౌటకూరి బాల్‌రెడ్డి దంపతులు అత్యధికంగా ₹5,30,000 (ఐదు లక్షల ముప్పై వేల రూపాయల) కు వేలం పాడి లడ్డూను దక్కించుకున్నారు. లడ్డూ ప్రసాదం గెలుచుకున్న బాల్‌రెడ్డి దంపతులకు ఉత్సవ కమిటీ సభ్యులు, కాలనీవాసులు శుభాకాంక్షలు తెలుపుతూ, వారి కుటుంబానికి ఆ వినాయకుని ఆశీస్సులు మెండుగా ఉండాలని ఆకాంక్షించారు. మొదటి ఏడాది ₹11 వేలు.. నేడు ₹5.30 లక్షలు: చౌటకూరి బాల్‌రెడ్డిఈ సందర్భంగా లడ్డూ దక్కించుకున్న చౌటకూరి బాల్‌రెడ్డి మాట్లాడుతూ.. “మా కాలనీలో 22 ఏళ్లుగా ఎంతో భక్తిశ్రద్ధలతో ఉత్సవాలు నిర్వహిస్తున్నాం. తొలి ఏడాది ₹11 వేలతో ప్రారంభమైన లడ్డూ వేలం పాట, నేడు భక్తుల విశ్వాసంతో ₹5.30 లక్షలకు చేరిందంటేనే స్వామివారి మహిమ ఎంతటిదో అర్థమవుతుంది. ఈ లడ్డూ ప్రసాదం దక్కడం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. గణనాథుని దయ, ప్రజల ఆశీస్సులతో మన కాలనీ అభివృద్ధికి ఎల్లప్పుడూ ముందుంటాను” అని హర్షం వ్యక్తం చేశారు.*ఐక్యతకు ప్రతీకగా ఉత్సవాలు: కాలనీవాసులు, ఉత్సవ కమిటీఅనంతరం ఉత్సవ కమిటీ ప్రతినిధులు, కాలనీ పెద్దలు మాట్లాడుతూ.. గత 22 సంవత్సరాలుగా రాజకీయాలు, పార్టీలకు అతీతంగా అందరం కలిసికట్టుగా పండుగ జరుపుకోవడం తమ కాలనీ సంప్రదాయమని తెలిపారు. ఈ ఏడాది కూడా అన్నదానం, లడ్డూ వేలం, శోభాయాత్రను ఐక్యతతో విజయవంతం చేశామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నారాయణరెడ్డి కాలనీ వాసులు, ఉత్సవ కమిటీ సభ్యులు,కాలనీ మహిళలు, యువకులు, చిన్నారులు, పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ADS

Most Popular