📄 ePaper
Wednesday, September 16, 2026
ADS
Homeమెదక్ జిల్లా వార్తలుపాపన్నపేట విద్యుత్ యూనియన్ అధ్యక్షుడిగా ఎండీ. సమీర్.

పాపన్నపేట విద్యుత్ యూనియన్ అధ్యక్షుడిగా ఎండీ. సమీర్.

📰 Generate e-Paper Clip

పాపన్నపేట విద్యుత్ యూనియన్ అధ్యక్షుడిగా ఎండీ. సమీర్

1104 సబ్‌ డివిజన్‌ నూతన కార్యవర్గం ఏకగ్రీవ ఎన్నిక

పాపన్నపేట,సెప్టెంబర్,16,మెదక్ టుడే న్యూస్:
పాపన్నపేట విద్యుత్ సబ్‌ డివిజన్‌ 1104 యూనియన్‌ ఎన్నికలు బుధవారం పాపన్నపేటలోని మంజీరా గార్డెన్స్‌లో నిర్వహించారు. మెదక్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శుల సమక్షంలో జరిగిన ఎన్నికల్లో నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.యూనియన్‌ అధ్యక్షుడిగా ఎండీ. సమీర్ (ఏఎల్‌ఎం, పాపన్నపేట), ఉపాధ్యక్షుడిగా పి. రవీందర్ (ఆర్టిజన్, పాపన్నపేట), కార్యదర్శిగా ఆర్. పనిందర్ (ఏఎల్‌ఎం, పెద్దశంకరంపేట), అదనపు కార్యదర్శిగా కే. మోహన్ (ఆర్టిజన్, టేక్మాల్) ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.నూతనంగా ఎన్నికైన కార్యవర్గ సభ్యులకు ఈ సందర్భంగా పలువురు నాయకులు, ఉద్యోగులు అభినందనలు తెలిపారు. యూనియన్‌ సభ్యుల సమస్యల పరిష్కారానికి నూతన కార్యవర్గం కృషి చేయాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో మెదక్ సర్కిల్ నాయకులు న్యాత ప్రసాద్, విట్టల్, కామారం శ్రీనివాస్, టేక్మాల్ సంగయ్య, డి. శివరాం నాయక్, రవీందర్ గౌడ్, గంట సుధీర్, ప్రశాంత్, ఎండీ. యూసుఫ్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ADS

Most Popular