📄 ePaper
Friday, July 31, 2026
ADS
Homeedupayala vanadhurgamma.TSఆషాఢమాసం తొలి ఆదివారం.శాఖంబరి దేవి రూపంలో భక్తులకు దర్శనమిచ్చిన ఏడు...

ఆషాఢమాసం తొలి ఆదివారం.శాఖంబరి దేవి రూపంలో భక్తులకు దర్శనమిచ్చిన ఏడు పాయల వనదుర్గాభవాని మాత.

📰 Generate e-Paper Clip

 

పాపన్నపేట,జూలై,19 (మెదక్ టుడే న్యూస్) ఆషాఢమాసం తొలి ఆదివారం సందర్భంగా మెదక్ జిల్లా ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన అమ్మలగన్న అమ్మ శ్రీ ఏడుపాయల వనదుర్గాభవాని అమ్మవారిని ఆదివారం శాఖంబరి దేవి రూపంలో అత్యంత వైభవంగా అలంకరించి భక్తులకు దర్శనమిచ్చారు.పచ్చని కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు, పుష్పాలతో సర్వాంగ సుందరంగా చేసిన ఈ విశేష అలంకరణ భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. ఉదయం నుంచే అమ్మవారి ఆలయానికి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు తరలివచ్చి ప్రత్యేక పూజలు, అభిషేకాలు, అర్చనలు నిర్వహించి అమ్మవారి ఆశీస్సులు పొందారు.ఆలయ ప్రాంగణమంతా భక్తుల గోవింద నామస్మరణలతో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు తగిన ఏర్పాట్లు చేశారు.ఆషాఢమాసంలో తొలి ఆదివారం నిర్వహించే శాఖంబరి దేవి అలంకరణకు ప్రత్యేక ప్రాధాన్యత ఉండటంతో ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని తమ మొక్కులు చెల్లించుకున్నారు.అమ్మవారి దివ్య దర్శనం భక్తులను భక్తి పారవశ్యంలో ముంచెత్తింది.

RELATED ARTICLES
- Advertisment -ADS

Most Popular