📄 ePaper
Wednesday, September 16, 2026
ADS
Homemedak political newsనార్సింగి గ్రామంలో 30కు పైగా సీఎం రిలీఫ్ ఫండ్ (CMRF)...

నార్సింగి గ్రామంలో 30కు పైగా సీఎం రిలీఫ్ ఫండ్ (CMRF) చెక్కుల పంపిణీ మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు చేతుల మీదుగా లబ్ధిదారులకు అందజేత

📰 Generate e-Paper Clip

పాపన్నపేట, జూలై 14 (మెదక్ టుడే): మెదక్ జిల్లా పాపన్నపేట మండలం నార్సింగి గ్రామ ప్రజలకు ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) ద్వారా మంజూరైన చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. గ్రామానికి ఇప్పటివరకు సుమారు 30కు పైగా సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు మంజూరుకాగా, వాటిని మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు లబ్ధిదారులకు అందజేశారు.
ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షుడు పుంటికూర నారాయణ గౌడ్ మాట్లాడుతూ, ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేద కుటుంబాలకు సీఎం రిలీఫ్ ఫండ్ ఎంతో ఉపయోగపడుతోందని అన్నారు. అర్హులైన ప్రతి లబ్ధిదారునికి ప్రభుత్వ సహాయం అందేలా నిరంతరం కృషి చేస్తున్నామని తెలిపారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వై. నర్సింలు, చాకలి నర్సింలు, వార్డు సభ్యుడు శ్రీరామ్ నవీన్ పాల్గొని లబ్ధిదారులకు చెక్కులను అందజేశారు. గ్రామ ప్రజలు ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావుకు, రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.
సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, అవసరమైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు చేరేలా కృషి కొనసాగుతుందని నాయకులు పేర్కొన్నారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామ పెద్దలు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ADS

Most Popular