నార్సింగి గ్రామంలో 30కు పైగా సీఎం రిలీఫ్ ఫండ్ (CMRF) చెక్కుల పంపిణీ మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు చేతుల మీదుగా లబ్ధిదారులకు అందజేత
పాపన్నపేట, జూలై 14 (మెదక్ టుడే): మెదక్ జిల్లా పాపన్నపేట మండలం నార్సింగి గ్రామ ప్రజలకు ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) ద్వారా మంజూరైన చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. గ్రామానికి ఇప్పటివరకు సుమారు 30కు పైగా సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు మంజూరుకాగా, వాటిని మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షుడు పుంటికూర నారాయణ గౌడ్ మాట్లాడుతూ, ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేద కుటుంబాలకు సీఎం రిలీఫ్ ఫండ్ ఎంతో ఉపయోగపడుతోందని...