📄 ePaper
Friday, June 5, 2026
ADS
HomeTelanganaబక్రీద్ పర్వదినాన A6 టీవీ అధినేత మహమ్మద్ అఫ్సర్‌కు జర్నలిస్టుల...

బక్రీద్ పర్వదినాన A6 టీవీ అధినేత మహమ్మద్ అఫ్సర్‌కు జర్నలిస్టుల శుభాకాంక్షలు.

📰 Generate e-Paper Clip

సోదరభావం, త్యాగస్ఫూర్తికి ప్రతీక బక్రీద్ : డాక్టర్ కొమ్ము వెంకన్నబాబు

మత సామరస్యానికి పండుగలు వేదిక కావాలి

(స్పెషల్ కరస్పాండెంట్)షాద్‌నగర్, మెదక్ టుడే న్యూస్:మే,28,పవిత్ర బక్రీద్ పర్వదినాన్ని పురస్కరించుకొని A6 టీవీ అధినేత మహమ్మద్ అఫ్సర్‌ను పలువురు జర్నలిస్టులు మర్యాదపూర్వకంగా కలిసి ఈద్ ముబారక్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సీనియర్ జర్నలిస్ట్, సామాజికవేత్త డాక్టర్ కొమ్ము వెంకన్నబాబు, టి.యు.డబ్ల్యూ.జే (ఐ.జే.యు) ఎలక్ట్రానిక్ మీడియా రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు చెక్కల శ్రీశైలం, సీనియర్ జర్నలిస్ట్ ఆకుల మల్లికార్జున్ తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా డాక్టర్ కొమ్ము వెంకన్నబాబు మాట్లాడుతూ బక్రీద్ పండుగ త్యాగానికి, విశ్వాసానికి, మానవతా విలువలకు ప్రతీక అని పేర్కొన్నారు. సమాజంలో పరస్పర ప్రేమాభిమానాలు, సోదరభావం పెంపొందించడంలో ఇటువంటి పండుగలు కీలక పాత్ర పోషిస్తాయని అన్నారు. మత భేదాలు లేకుండా ప్రతి ఒక్కరూ పరస్పరం గౌరవించుకుంటూ ఐకమత్యంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.
అలాగే బక్రీద్ సందేశం మనిషిలో సేవాభావాన్ని, పేదల పట్ల కరుణను పెంపొందిస్తుందని పేర్కొన్నారు. సమాజంలో శాంతి, సహనం, పరస్పర గౌరవం నెలకొల్పేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు.ఈ సందర్భంగా మహమ్మద్ అఫ్సర్ మాట్లాడుతూ జర్నలిస్టులు వచ్చి శుభాకాంక్షలు తెలియజేయడం ఆనందంగా ఉందని తెలిపారు. సమాజంలో మత సామరస్యాన్ని కాపాడడంలో మీడియా కీలక పాత్ర పోషించాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో పలువురు మీడియా ప్రతినిధులు, మిత్రులు పాల్గొని పరస్పరం బక్రీద్ శుభాకాంక్షలు తెలుపుకున్నారు.

RELATED ARTICLES
- Advertisment -ADS

Most Popular