📄 ePaper
Friday, June 5, 2026
ADS
HomeNewsఅక్రమ వెంచర్‌పై 'సూరన్న' ఫిర్యాదు-అధికారులు నామమాత్రపు చర్యలు చేపడితే ఊరుకోం.

అక్రమ వెంచర్‌పై ‘సూరన్న’ ఫిర్యాదు-అధికారులు నామమాత్రపు చర్యలు చేపడితే ఊరుకోం.

📰 Generate e-Paper Clip

అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తామని బడంగ్‌పేట్ కమిషనర్ హామీ.

బడంగ్‌పేట్: బడంగ్‌పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని బాలాపూర్ వద్ద వెలసిన భారీ అక్రమ వెంచర్‌పై జర్నలిస్ట్ సూరన్న అధికారులకు ఫిర్యాదు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా సాగుతున్న ఈ వెంచర్ అక్రమాలను ఆయన సాక్ష్యాధారాలతో అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన బడంగ్‌పేట్ కమిషనర్, అక్రమ వెంచర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.తూతూమంత్రంగా కూల్చివేతలు వద్దుగతంలో సర్వే నంబర్ 9, 10లలో వెలసిన ఈ వెంచర్‌పై ఫిర్యాదులు రాగా, టౌన్ ప్లానింగ్ అధికారులు కేవలం షో కోసం ఒకట్రెండు విద్యుత్ స్తంభాలను తొలగించి చేతులు దులుపుకున్నారని సూరన్న తన ఫిర్యాదులో పేర్కొన్నారు. డ్రైనేజీ, రోడ్లు, ప్రీకాస్ట్ వాల్ వంటి నిర్మాణాలను ముట్టుకోకపోవడం వెనుక ఉన్న అంతర్యమేమిటని ఆయన ప్రశ్నించారు.అవినీతి అధికారుల గుట్టురట్టు
వెంచర్‌కు అనుమతులు లేకపోయినా ప్లాట్లకు అనుమతులు ఎలా ఇస్తున్నారని, దీనిపై ఏసీబీ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. అధికారుల నిర్లక్ష్యం వల్ల సామాన్య ప్రజలు మోసపోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.కమిషనర్ హామీ:
పూర్తిస్థాయిలో విచారణ జరుపుతాం”
సూరన్న ఫిర్యాదుపై సానుకూలంగా స్పందించిన కమిషనర్, వెంటనే క్షేత్రస్థాయిలో పరిశీలించి అక్రమ నిర్మాణాలను పూర్తిస్థాయిలో కూల్చివేయాలని టౌన్ ప్లానింగ్ అధికారులను ఆదేశించారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు.

RELATED ARTICLES
- Advertisment -ADS

Most Popular