📄 ePaper
Thursday, March 19, 2026
ADS
HomePOITICAL NEWSడ్రైనేజీ పనులకు శంకుస్థాపన చేసిన సర్పంచ్ సండ్రుగు స్రవంతి సతీష్.

డ్రైనేజీ పనులకు శంకుస్థాపన చేసిన సర్పంచ్ సండ్రుగు స్రవంతి సతీష్.

📰 Generate e-Paper Clip

డ్రైనేజీ పనులు మొదలు పెట్టిన వార్డు సభ్యుడు ఆకుల సుఖేందర్

చేగుంట,మార్చి,16,మెదక్ టుడే న్యూస్:చేగుంట పట్టణ కేంద్రంలోనీ 14 వ వార్డులో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు గ్రామ సర్పంచ్ సండ్రుగు స్రవంతి సతీష్, వార్డు సభ్యుడు ఆకుల సుఖేందర్ పనులు ప్రారంభం చేయడం జరిగింది. గ్రామ సర్పంచ్ మాట్లాడుతూ చేగుంట పట్టణలో అభివృద్ధిలో భాగంగా సోమవారం 14వ వార్డులో డ్రైనేజీ పనులకు శంకుస్థాపన చేయడం జరిగింది వార్డులో మిగతా డ్రైనేజీ పనులు కూడా పూర్తి చేస్తామని అభివృద్ధిలో ప్రజలందరూ సహకారం అందించాలని పట్టణాభివృద్ధికి ఎప్పుడు ముందుంటామని తెలియజేశారు, వార్డు సభ్యులు ఆకుల సుఖేందర్ మాట్లాడుతూ,14 వ వార్డు అభివృద్ధిలో భాగంగా డ్రైనేజీ నిర్మాణానికి సర్పంచ్ అధ్వర్యంలో శంకుస్థాపన చేయడం జరిగింది అని వార్డులో అభివృద్ధి పనులకు సర్పంచ్ సహకారం ఉందని తప్పకుండా 14వ వార్డులు అన్ని విధాలుగా అభివృద్ధి చేసుకుందామని వార్డు ప్రజల సహకారం ఉండాలని అన్నారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ స్రవంతి సతీష్ వార్డు సభ్యులు ఆకుల సుఖేందర్, కటిక రవి సాయిబాబా, డీలర్ శ్రీనివాస్ ,కట్ట శ్రీనివాస్ ,సండ్రుగు శ్రీకాంత్, కామిశెట్టి రాములు ,ముత్యం రెడ్డి ,ఒంటరి రాంరెడ్డి,శంకర్ సార్, యాదిరెడ్డి సురేందర్,రవీందర్, నాగార్జున,రమేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ADS

Most Popular

Recent Comments