📄 ePaper
Tuesday, March 10, 2026
ADS
HomePOITICAL NEWSఅమీన్‌పూర్‌లో అంగరంగ వైభవంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు.

అమీన్‌పూర్‌లో అంగరంగ వైభవంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు.

📰 Generate e-Paper Clip

మహిళల ఆనందోత్సాహాల మధ్య గిఫ్టులు, బహుమతుల ప్రదానం

బిఆర్ఎస్ సీనియర్ నాయకురాలు కాటా సునీత రాజు గౌడ్ ఆధ్వర్యంలో వేడుకలు.

అమీన్‌పూర్,మార్చి,8,మెదక్ టుడే న్యూస్:ప్రతినిధి.అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని అమీన్‌పూర్ మున్సిపల్ పరిధిలోని బిఆర్ఎస్ పార్టీ కార్యాలయం వద్ద మహిళా దినోత్సవ వేడుకలు ఆదివారం అత్యంత వైభవంగా జరిగాయి. బిఆర్ఎస్ సీనియర్ నాయకురాలు శ్రీమతి కాటా సునీత రాజు గౌడ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో వందలాది మంది మహిళలు పాల్గొని ఉత్సాహంగా వేడుకలు జరుపుకున్నారు.

ఆటపాటలతో సందడి చేసిన మహిళలు

మహిళల కోసం ప్రత్యేకంగా నిర్వహించిన వివిధ రకాల ఆటపాటలు, పోటీలు అందరినీ ఆకట్టుకున్నాయి. రోజువారీ పనుల ఒత్తిడిని మర్చిపోయి మహిళలందరూ ఎంతో ఉల్లాసంగా, ఉత్సాహంగా పోటీలలో పాల్గొన్నారు. గెలుపొందిన విజేతలకు కాటా సునీత రాజు గౌడ్ స్వయంగా బహుమతులు మరియు ప్రత్యేక కానుకలను అందజేసి వారిని అభినందించారు.

మహిళా శక్తికి సలాం: కాటా సునీత రాజు గౌడ్

ఈ సందర్భంగా కాటా సునీత రాజు గౌడ్ మాట్లాడుతూ, కీలక వ్యాఖ్యలు చేశారు. “మహిళలు తలచుకుంటే సాధించలేనిది ఏదీ లేదు. కుటుంబ బాధ్యతలతో పాటు సమాజ నిర్మాణంలోనూ స్త్రీల పాత్ర వెలకట్టలేనిది. ఈ రోజు మహిళలందరి మధ్య ఇలా పండగలా వేడుకలు నిర్వహించడం మాకు ఎంతో సంతోషాన్నిస్తోంది. ఆడబిడ్డల ముఖంలో చిరునవ్వు చూడటమే మాకు అసలైన విజయం. ప్రతి మహిళా ఆర్థికంగా, సామాజికంగా ఎదగాలని, అందుకు మా వంతు సహకారం ఎప్పుడూ ఉంటుంది” అని ఆమె పేర్కొన్నారు.అనంతరం వేడుకలలో భాగంగా కేక్ కట్ చేసి ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ మహిళా ప్రతినిధులు, స్థానిక మహిళా సంఘాల సభ్యులు మరియు భారీ సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ADS

Most Popular

Recent Comments