📄 ePaper
Friday, September 18, 2026
ADS
Homeక్రైమ్ప్రమాదవశాత్తూ నీట మునిగి ఒకరు మృతి…

ప్రమాదవశాత్తూ నీట మునిగి ఒకరు మృతి…

📰 Generate e-Paper Clip

పాపన్నపేట,జనవరి,24,మెదక్ టుడే న్యూస్:    ప్రమాదవశాత్తూ నీట మునిగి ఒకరు మృతి చెందిన సంఘటన మండల పరిధిలోని చీకోడ్ గ్రామంలో చోటు చేసుకుంది.ఎస్సై శ్రీనివాస్ గౌడ్ కథనం ప్రకారం…గ్రామానికి చెందిన బోయిని సత్యనారాయణ(43) బతుకు దెరువు కోసం కుటుంబంతో కలసి హైదరాబాద్ లో ఉంటూ కూలీ పనులు చేసుకుంటున్నారు.కాగా మూడు రోజుల క్రితం కుమార్తె సీమంతం కోసం గ్రామానికి వచ్చారు.శుక్రవారం మధ్యాహ్నం సమయంలో సత్యనారాయణ కాలకృత్యాల కోసం ఇంటి నుంచి బయటకు వెళ్లాడు.రాత్రి అయినా తిరిగి ఇంటికి రాకపోయేసరికి కుటుంబీకులు చుట్టూ పక్కల వెతికారు.గ్రామ శివారులోని చెరువు వద్ద సత్యనారాయణ చెప్పులు కనిపించగా అనుమానంతో చెరువులో గాలించగా మృతదేహం లభ్యమైంది.మృతదేహాన్ని వెలికి తీసి పోస్టుమార్టం నిమిత్తం మెదక్ జిల్లా ఆస్పత్రికి తరలించి మృతుడి భార్య అనిత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై పేర్కొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ADS

Most Popular