మెదక్ జనవరి,1,మెదక్ టుడే న్యూస్:(ప్రతినిధి) గురువారంమెదక్ పట్టణంలోని బాల సాధన్‌లో పిల్లలతో కలిసి నూతన సంవత్సర వేడుకలను మెదక్ జిల్లా ఎస్ పి శ్రీ డి. వి. శ్రీనివాస రావు ఘనంగా జరుపుకున్నారు.ఈ సందర్భంగా అక్కడ ఉన్న పిల్లలకు నోట్‌బుక్స్ పంపిణీ చేశారు.పిల్లలతో స్నేహపూర్వకంగా ముచ్చటించిన ఎస్ పి వారి చదువుల గురించి అడిగి తెలుసుకున్నారు. అలాగే భవిష్యత్తులో వారు సాధించాలనుకుంటున్న లక్ష్యాల వివరాలు తెలుసుకొని, మంచి విద్యతో పాటు క్రమశిక్షణ, కష్టపడి చదివే అలవాటు ఉంటే ఉన్నత స్థానాలకు చేరుకోవచ్చని పిల్లలకు ప్రోత్సాహం అందించారు.పిల్లల భవిష్యత్తే సమాజ భవిష్యత్తు అని, వారు మంచి పౌరులుగా ఎదగాలంటే విద్యే ప్రధాన ఆయుధమని ఈ సందర్భంగా ఎస్ పితెలిపారు.నూతన సంవత్సరంలో పిల్లలందరూ ఆరోగ్యంగా, ఆనందంగా చదువులో ముందుకు సాగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మెదక్ జిల్లా అదనపు ఎస్పీ శ్రీ ఎస్. మహేందర్, డీఎస్పీలు శ్రీ ప్రసన్న కుమార్, శ్రీ నరేందర్ గౌడ్, శ్రీ రంగా నాయక్, సీఐలు శ్రీ మహేష్, శ్రీ కృష్ణమూర్తి, శ్రీ శైలేందర్, బాల సాధన్ అధికారులు మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

