బాల సాధన్‌లో పిల్లలతో కలిసి నూతన సంవత్సర వేడుకలు జిల్లా ఎస్ పి శ్రీనివాసరావు.

మెదక్ జనవరి,1,మెదక్ టుడే న్యూస్:(ప్రతినిధి) గురువారంమెదక్ పట్టణంలోని బాల సాధన్‌లో పిల్లలతో కలిసి నూతన సంవత్సర వేడుకలను మెదక్ జిల్లా ఎస్ పి శ్రీ డి. వి. శ్రీనివాస రావు ఘనంగా జరుపుకున్నారు.ఈ సందర్భంగా అక్కడ ఉన్న పిల్లలకు నోట్‌బుక్స్ పంపిణీ చేశారు.పిల్లలతో స్నేహపూర్వకంగా ముచ్చటించిన ఎస్ పి వారి చదువుల గురించి అడిగి తెలుసుకున్నారు. అలాగే భవిష్యత్తులో వారు సాధించాలనుకుంటున్న లక్ష్యాల వివరాలు తెలుసుకొని, మంచి విద్యతో పాటు క్రమశిక్షణ, కష్టపడి చదివే అలవాటు ఉంటే ఉన్నత స్థానాలకు చేరుకోవచ్చని పిల్లలకు ప్రోత్సాహం...