పాపన్నపేట,డిసెంబర్,9,మెదక్ టుడే న్యూస్// గ్రామాల్లో ప్రశాంతంగా స్థానిక ఎన్నికలు నిర్వహించాలిజిల్లా ఎన్నికల అధికారి,జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్,గ్రామాల్లో ప్రశాంతంగా స్థానిక ఎన్నిక నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అధికారుల ఆదేశించారు.
మంగళవారం కలెక్టర్ కార్యాలయంలోని కలెక్టర్ ఛాంబర్ లో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు.ఈ సందర్భంగా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, శత శాతం ఓటింగ్ ఎలక్షన్ గా పని చేయాలన్నారు.ప్రజలు వంద శాతం ఓటింగ్ లోపాల్గొనాలన్నారు.జిల్లాలో మొదటి విడత స్థానిక ఎన్నికలలో 160 గ్రామ పంచాయతీలు ఉండగా , 16 గ్రామ పంచాయతీలు సర్పంచలు ఏకగ్రీవమయ్యాయని, మిగిలిన 144 గ్రామ పంచాయతీలకు గాను 411 మంది సర్పంచ్ అభ్యర్థులుగా పోటీలో ఉన్నారన్నారు.1402 వార్డులకు గాను , 332 ఏకగ్రీవంగా అవ్వగా, పాపన్నపేట మండలంలోని అరికెల గ్రామంలో రెండు వార్డులకు ఎలాంటి నామినేషన్లు రాలేదని తెలిపారు.
1068 వార్డులకు గాను 2426 మంది వార్డు సభ్యులు బరిలో ఉన్నారని తెలియజేశారు. ఆరు మండలాలకు గాను 1292 పోలింగ్ కేంద్రాలు, 14 21 పిఓ లు, 1529 ఓపిఓలు, 155 మంది రిటర్నింగ్ ఆఫీసర్లను నియమించినట్టు తెలిపారు.
మండలాల వారీగా ఓటర్ల వివరాలు
అల్లాదుర్ మండలంలో
పురుష ఓటర్లు 11,296
మహిళా ఓటర్లు 12,259
మొత్తం……….23,555
హవేలీ ఘనపూర్
పురుష ఓటర్లు 13,987
మహిళా ఓటర్లు 15,876
మొత్తం………. 29,863
పాపన్నపేట
పురుష ఓటర్లు 19,986
మహిళా ఓటర్లు 22,416
ఇతరులు……….01
మొత్తం…………42,403
రేగోడు
పురుష ఓటర్లు 9,192
మహిళా ఓటర్లు 9,555
మొత్తం………….18,747
శంకరంపేట ( ఏ)
పురుష ఓటర్లు 15,001
మహిళా ఓటర్లు 15,953
ఇతరులు………..01
మొత్తం………30,955
టేక్మాల్
పురుష ఓటర్లు 13,844
మహిళా ఓటర్లు 14,989
మొత్తం…………28,833
మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారని తెలిపారు.
