📄 ePaper
Sunday, September 20, 2026
ADS
Home Blog Page 34

చేగుంట సబ్ స్టేషన్ లో విద్యుత్ భద్రత వారోత్సవాలు.

0

చేగుంట,మే,4,మెదక్ టుడే న్యూస్:చేగుంట మండలం చేగుంట సబ్ స్టేషన్ లో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజులలో భాగంగా విద్యుత్ భద్రత వారోత్సవాలు ఏఈ వెంకటప్ప రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించబడినది ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి వారు మాట్లాడుతూ విద్యుత్ భద్రత వారోత్సవాల్లో భాగంగా మా విద్యుత్ సిబ్బందికి సేఫ్టీ కిట్లు పంపిణీ చేయడం జరిగింది . సేఫ్టీ కిట్లు అనగా హెల్మెట్ గ్లౌజులు ఎర్త్ రాడు వంటివి మా సిబ్బందికి ఇవ్వడం జరిగింది. వాటిని ఉపయోగిస్తూ ప్రజలకు మంచి సేవలు అందించాలని సిబ్బందికి తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఏఈ వెంకటప్ప రెడ్డి, లైన్ ఇన్స్పెక్టర్ రాములు, లైన్మెన్ కిష్టయ్య విద్యుత్ సిబ్బంది మరియు రైతులు పాల్గొనడం జరిగినది.

6వ వార్డు కౌన్సిలర్, రాజు దంపతులకు వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు.

0

(స్పెషల్ కరస్పాండెంట్)
షాద్‌నగర్:మే,4,మెదక్ టుడే న్యూస్:
6వ వార్డు కౌన్సిలర్ డి. రాజు నాయక్ మరియు పుష్ప దంపతులకు వారి వివాహ వార్షికోత్సవ సందర్భంగా శుభాకాంక్షలు వెల్లువెత్తాయి.సమాజ హితం కోసం నిరంతరం కృషి చేస్తూ, నిష్పక్షపాత ధోరణితో ప్రజల సమస్యలను వెలుగులోకి తీసుకువస్తున్న రాజు నాయక్ సేవలను ఈ సందర్భంగా పలువురు ప్రశంసించారు. ఆయనకు అండగా నిలుస్తూ ప్రేరణగా నిలుస్తున్న ఆయన సహచరి పుష్ప పాత్రను కూడా గుర్తుచేశారు.ఈ ప్రత్యేక సందర్భంలో వారి దాంపత్య జీవితం ఆనందం, ఆరోగ్యం, ఐశ్వర్యాలతో నిండాలని సామాజికవేత్త, సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ కొమ్ము వెంకన్న బాబు ఆకాంక్షించారు.

రెవెన్యూ,అటవీ భూముల సరిహద్దు సమస్యలను పరిష్కరించాలి-జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్.

0

మెదక్,మే,4,మెదక్ న్యూస్:ప్రతినిధి,రెవెన్యూ,అటవీ భూముల సరిహద్దు సమస్యలను పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ అధికారులకు సూచించారు.సోమవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్ నగేష్,అటవీ,సివిల్ సప్లై,హౌసింగ్, రెవెన్యూ,మిషన్ భగీరథ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ మాట్లాడుతూ.. రెవెన్యూ,అటవీ భూముల సరిహద్దు సమస్యలను పరిష్కరించాలని, ధాన్యాంకోనుగోలు లో లోడింగ్ ఆన్ లోడింగ్ పక్రియ త్వరగా పూర్తి చేయాలని, వేసవిలో త్రాగు నీటి సమస్య రాకుండా చూడాలన్నారు.
ఇందిరమ్మ ఇండ్ల పురోగతిని తెలుసుకున్నారు. త్వరగా నిర్మాణాలు పూర్తి చేసి గృహ ప్రవేశాలు చేపట్టాలని ఆదేశించారు. సాదా బైనామాలు పరిశీలించాలని, జనగణన ప్రక్రియలో ప్రజలను భాగస్వామ్యం , స్వీయ గణనలో అధికారులు భాగస్వామ్యం కావాలన్నారు.
సంక్షేమ వారోత్సవాలను ఘనంగా నిర్వహించాలన్నారు. రెడ్ క్రాస్ సొసైటీ సేవలు విస్తరించాలని సభ్యత్వం పెంచాలని సూచించారు.ఈ కార్యక్రమంలో అటవీశాఖ అధికారి జోజీ, ఆర్డీవోలు తాసిల్దార్లు రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.

ప్రజావాణి దరఖాస్తులు పరిష్కరించాలి-జిల్లా అదనపు కలెక్టర్ నగేష్.

0

సోమవారం ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా ప్రజావాణి హాల్లో ప్రజలనుంచి వినతులను స్వీకరించారు.ఆర్డీవో స్థాయిలో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు .
ఆర్డీవో మెదక్ లో -9
ఆర్డీవో తూప్రాన్ 2
ఆర్డీవో నర్సాపూర్ లో 2 దరఖాస్తులు స్వీకరించారు.
జిల్లా కలెక్టరేట్లో 45 దరఖాస్తులు స్వీకరించారు.
పెన్షన్లు 15, ధరణి 15, ఇతర 15 దరఖాస్తుల స్వీకరించారు.
తక్షణమే దరఖాస్తులను పరిష్కరించాలని జిల్లా అదనపు కలెక్టర్ అధికారులను ఆదేశించారు.

రైతులకు ఇబ్బందులు లేకుండా యాసంగి వారి ధాన్యము కొనుగోలు చేపట్టాలి.రాష్ట పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తం కుమార్ రెడ్డి.

0


మెదక్,మే,4, మెదక్ టుడేన్యూస్:ప్రతినిధి,రైతులకు ఎలాంటి ఇబ్బందులు యాసంగి వరి ధాన్యము కొనుగోలు చేయాలనీ రాష్ట పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తo కుమార్ రెడ్డి అన్నారు. సోమవారం హైదరాబాద్ లోని రాష్ట సచివారయం నుండి అన్ని జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, పౌర సరఫరాల శాఖ అధికారులతో నిర్వహించిన విడియో కాన్ఫరెన్స్ కార్యక్రమానికి మంత్రులు పొన్నం ప్రబాకర్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, వాకిటి శ్రీహరి, దుద్దిలా శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ కుమార్, రాష్ట ప్రభుత్వ ప్రధాన కార్య దర్శి రామకృష్ణా రావు, పౌర సరఫరాల శాఖ కమిషనర్ స్టిఫెన్ రవీంద్ర, రవాణా శాఖ కమిషన్ ఇలంబర్తి తో కలిసి రాష్ట పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తం కుమార్ రెడ్డి విడియో విడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్టంలో అకాల వర్షాలు కురుస్తున్నందున కొనుగోలు కేంద్రాలలో రక్షణ చర్యలు తీసుకోవాలన్నారు. కొనుగోలు కేంద్రాలలో సరిపడా టార్పలిన్ కవర్లు, అందుబాటులో వుండేలా చర్యలు తీసుకోవాలన్నారు. తక్కువ సమయంలో ఎక్కువ వర్షం కురుస్తున్నందున రైతులు తమ ధాన్యం కుప్పలను ఎత్తు ప్రాంతంలో ఉంచుకోవాలన్నారు. గాలులకు టార్పాలిన్ కవర్లు ఎగిరి పోతున్నాయని రైతులు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అధికారులు వాతావరణ శాఖ హెచ్చరికలను రైతులకు తెలియ జేయలన్నారు. కొనుగోలు కేంద్రాలలో రైతులకు ఇబ్బందులు లేకుండా త్రాగు నీరు, షామియానా, ఓ ఆర్ ఎస్, ప్యాకెట్లు అందుబాటులో వుండేలా చర్యలు తీసుకోవాలన్నారు. మైచర్ యంత్రాలు ఆటో మేటిక్ ప్యాడి క్లెనర్ లు అందుబాటులో ఉంచాలన్నారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని కేటాయించిన రైస్ మిల్లులకు పంపించాలన్నారు. ఎక్కడ కుడా జాప్యం, చేయకుడదన్నారు. హమిలిలు, వాహనాల కొరత రాకుండా సర్దుబాటు చేసుకోవాలన్నారు. ప్రతి కొనుగోలు కేంద్రాలకు గ్రామ స్థాయి అధికారులు మండల స్థాయి అధికారులు పర్య వేక్షించాలన్నారు. మే నెల చివరి కల్లా 80% ధాన్యము కొనుగోళ్ళు పూర్తి చేయాలన్నారు. జిల్లా కేంద్రంలోని సమీకృత కలెక్టరేట్ భవన సముదాయంలోని విడియో కాన్ఫరెన్స్ హాలులో నిర్వహించిన విడియో కాన్ఫరెన్స్ కార్యక్రమానికి కలెక్టర్ ప్రతిమా సింగ్, అదనపు కలెక్టర్ నగేష్ వివిధ శాఖ అధికారులతో కలిసి పాల్గొన్నారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో అన్ని కేంద్రాల్లో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందని కొనుగోలు కేంద్రాలలో రైతులకు ఇబ్బందులు లేకుండా పూర్తి స్థాయి ఏర్పాట్లు చేయడం జరుగుతుందని కొనుగోలు కేంద్రంలో మైచర్ యంత్రం, ఆటో మేటిక్ ప్యాడి క్లేనర్స్ అందుబాటులో ఉంచాలన్నారు. ప్రతి కొనుగోలు కేంద్రానికి 100 చొప్పున టార్పలిన్ కవరు అందించాలన్నారు. ఎండ తీవ్రత దృష్ట్యా కొనుగోలు కేంద్రాలలో అవసరమైన ఏర్పాట్లు చేయాలన్నారు. హమాలీల కొరత, వాహనాల కొరత లేకుండా స్థానికంగా వున్నా హమాలిలను ,వాహానాలను సర్దు బాటు చేసుకోవాలన్నారు. చివరి గింజ వరకు కొనుగోలు చర్యలు తిసుకుంటామన్నారు. తూకం వేసిన ధాన్యాన్ని వెంటనే కేటాయించిన రైస్ మిల్లులకు తరలించాలన్నారు. ఎక్కడ కుడా జాప్యం జరుగకూడదన్నారు. సమన్వయంతో పని చేసి యాసంగి వరి ధాన్యం కొనుగోలు పూర్తీ చేయాలన్నారు. ఎక్కడ నిర్లక్ష్యం వహించాకుదన్నారు.
ఈ విడియో కాన్ఫరెన్స్ లో రవాణశాఖ మార్కెటింగ్ శాఖ , పౌర సరఫరాల శాఖ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించాలి-జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్.

0

-ఎక్కువ ఆదాయం వచ్చే ప్రత్యామ్నాయ పంటలను సాగు చేసుకోవాలని మెదక్ కలెక్టర్ ప్రతిమ సింగ్ సూచించారు.
భూసార పరీక్షల విధానాన్ని అడిగి తెలుసుకున్నారు.

ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా రైతు వారోత్సవ కార్యక్రమాలు మెదక్ జిల్లాలో పలు రైతు వేదికలలోఘనంగా జరుగుతున్నాయి.

మెదక్,మే,4,మెదక్ టుడే న్యూస్:ప్రతినిధి, సోమవారం మెదక్ కలెక్టర్ ప్రతిమ సింగ్ కౌడిపల్లి రైతు వేదికలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ మాట్లాడుతూ.. ప్రత్యామ్నాయ పంటలైన కూరగాయలు, పూల మొక్కలు సాగు చేసుకోవాలని సూచించారు. కౌడిపల్లి, చేగుంట, తూప్రాన్ లో కొందరు రైతులు ఆ దిశగా సాగు చేస్తున్నారని పేర్కొన్నారు.
మెదక్ జిల్లా హైదరాబాద్ కు దగ్గరలో ఉంది కనుక మార్కెట్ చేసుకోవడానికి సులువుగా ఉంటుందన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న “రైతు వారోత్సవాలు–2026” కార్యక్రమాన్ని జిల్లాలో మే 04 నుండి మే 09 వరకు అన్ని మండలాలు, గ్రామపంచాయతీలు, రైతు వేదికలు, క్లస్టర్ స్థాయిలో అత్యంత ప్రతిష్టాత్మకంగా, ప్రజాభిమానాన్ని పొందేలా నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు.
ప్రస్తుత పరిస్థితుల్లో మారుతున్న వాతావరణ పరిస్థితులు, ఉత్పత్తి వ్యయాల పెరుగుదల, మార్కెట్ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని రైతులు శాస్త్రీయ పద్ధతులు అవలంబించడం అత్యవసరమని తెలిపారు. అందుకోసం రైతు వారోత్సవాల ద్వారా ప్రతి రైతుకు నేరుగా చేరుకుని, క్షేత్రస్థాయిలో సమగ్ర అవగాహన కల్పించాలని అధికారులను కోరారు.
జిల్లాలోని ప్రతి గ్రామంలో ఒక్క రైతు కూడా మిగలకుండా కార్యక్రమాల్లో పాల్గొనేలా ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని, రైతు వేదికలను కేంద్రబిందువుగా చేసుకుని రైతులతో ముఖాముఖి సమావేశాలు, క్షేత్ర ప్రదర్శనలు, సాంకేతిక సదస్సులు, ప్రత్యక్ష శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి దేవకుమార్,స్థానిక వ్యవసాయ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.

ప్రజావాణి ఫిర్యాదులకు సత్వర పరిష్కారం- మెదక్ జిల్లా ఎస్పీ డివి శ్రీనివాసరావు.

0

పాపన్నపేట,మే,4,మెదక్ టుడే న్యూస్:ప్రతినిధి, ప్రజావాణిలో బాధితులకు భరోసా కల్పించిన మెదక్ జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాస రావు,ప్రజావాణి కార్యక్రమంలో వచ్చిన ఫిర్యాదులకు సత్వర పరిష్కారం చూపాలని జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాస రావు ఆదేశించారు. సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లాలోని పలు గ్రామాల నుండి వచ్చిన ప్రజలు తమ సమస్యలను ఎస్పీకి నేరుగా విన్నవించుకున్నారు.ఈ సందర్భంగా ప్రతి ఫిర్యాదుదారునితో వ్యక్తిగతంగా మాట్లాడిన ఎస్పీ, వారి సమస్యలను సమగ్రంగా తెలుసుకున్నారు. అందిన ఫిర్యాదులను క్షుణ్ణంగా పరిశీలించి, తక్షణ చర్యలు తీసుకోవాలని సంబంధిత సర్కిల్ ఇన్‌స్పెక్టర్లు, సబ్‌ఇన్‌స్పెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. కొన్ని అంశాలపై ఎస్‌హెచ్‌ఓలతో ఫోన్‌లో మాట్లాడి వేగవంతమైన చర్యలు చేపట్టాలని సూచించారు.ప్రజలకు ఎల్లప్పుడూ పోలీస్ శాఖ అందుబాటులో ఉంటుందని, ఎలాంటి పైరవీలు అవసరం లేకుండా నేరుగా అధికారులను సంప్రదించాలని ఎస్పీ తెలిపారు. చట్టపరమైన మార్గంలో ప్రతి ఒక్కరికీ న్యాయం అందించడం పోలీస్ శాఖ ప్రధాన బాధ్యత అని పేర్కొన్నారు. ప్రజావాణి కార్యక్రమం ద్వారా ఇప్పటికే అనేక సమస్యలు పరిష్కారమై ప్రజల్లో పోలీస్ శాఖపై నమ్మకం పెరిగిందని ఎస్పీ తెలిపారు.

రహదారుల పై ధాన్యం ఆరబోయవద్దు -ఎస్ ఐ శ్రీనివాస్ గౌడ్.

0

పాపన్నపేట,మే,4,మెదక్ టుడే న్యూస్:మండలంలో రహదారుల పై ధాన్యం ఆరబోసిప్రమాదాలకు కారణమైతే చర్యలు తప్పవని ఎస్సై శ్రీనివాస్ గౌడ్
అన్నారు.సోమవారం ఆయన ఎల్లపూర్,మిన్ పూర్, యూసుఫ్ పేట, కొత్తపల్లి గ్రామాల శివార్లలో మెదక్ — బొడ్మట్ పల్లి రహదారి పై ధాన్యం ఆరబోసిన రైతులతో మాట్లాడుతూ…రైతులు తమ ధాన్యాన్ని రోడ్లపై ఆరబోయడంతో ప్రమాదాలు జరిగే అవకాశం ఉందన్నారు.ధాన్యం కుప్పల పక్కన రాళ్లు, కర్రలు పెడుతున్నారని రాత్రివేళ అవి వాహనదారులకు కనిపించక పెద్ద ప్రమాదాలు జరిగే ఆస్కారంఉందన్నారు.వాహనదారులకు ఇబ్బందులు లేకుండా ఖాళీ ప్రదేశాలలోధాన్యంఆరబోసుకోవాలన్నారు.ధాన్యం కుప్పల వద్ద ప్రమాదాలు జరిగితే చర్యలు తప్పవన్నారు.ప్రజల ప్రయోజనార్థం చర్యలు తీసుకుంటున్నట్లుచెప్పారు.రైతులుసహకరించాలనిసూచించారు.ఆయన వెంట హెడకానిస్టేబుల్ అంజయ్య, కానిస్టేబుల్ లు ప్రవీణ్,వసంత్,మధులుతదితరులున్నారు.

ఇందిరమ్మ ఇండ్లు .. పేదలకు వరం

0

ఇందిరమ్మ ఇండ్లు .. పేదలకు వరం

పాపన్నపేట,మే,4,మెదక్ టుడే న్యూస్:ఇందిరమ్మ ఇండ్ల పథకం పేదలకు వరం లాంటిదని పాపన్నపేట గ్రామ సర్పంచ్ పావని నరేందర్ గౌడ్ పేర్కొన్నారు. సోమవారం పాపన్నపేటలో అచ్చుకట్ల రాణి రమేష్ నూతన గృహన్ని ఆమె అధికారులతో కలిసి ప్రారంభించారు. కార్యక్రమంలో తహశీల్దార్ సతీష్ కుమార్,ఎంపీడీవో విష్ణువర్ధన్,హౌసింగ్ ఏఈ అరుణ్ ప్రసాద్ గౌడ్,ఎస్ఐ శ్రీనివాస్ గౌడ్,ఉప సర్పంచ్ సద్దామ్ హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు .

ఇందిరమ్మ ఇండ్లను ప్రారంభించిన దుబ్బాక కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి.

0

ప్రతి పేదవాడు ఇల్లు కట్టుకోవాలని లక్ష్యంతో ఈ ప్రభుత్వం పని చేస్తుంది. సిహెచ్ శ్రీనివాస్ రెడ్డి.

చేగుంట,మే,3,మెదక్ టుడే న్యూస్:చేగుంట మండలంలో చేగుంటకు చెందిన వోడపల్లి చంద్రకళ శ్రీనివాస్, ఉల్లి తిమ్మాయిపల్లి గ్రామ ఉపసర్పంచ్ నిరుడి లావణ్య శ్రీకాంత్ పెద్దశివునూరు గ్రామానికి చెందిన ముదాం నవనీత నాగరాజు , కుమ్మరి భాగ్యమ్మ , పెద్ద శివునూర్తాండాలో మాలోత్ పద్మ లక్ష్మణ్ ఇల్లు లను ప్రారంభించడం జరిగింది. చెరుకు శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ చేగుంట మండలానికి సుమారుగా 650 ఇండ్లను మంజూరు చేయడం జరిగింది.ప్రతి పేదవాడు ఇల్లు కట్టుకోవాలని లక్ష్యంతో ఈ ప్రభుత్వం పని చేస్తుంది. జిల్లా ఇన్చార్జ్ మినిస్టర్ ను సంప్రదించి రెండో విడతల మరిన్ని ఇండ్లను మంజూరు చేయిస్తానని హామీ ఇవ్వడం జరిగింది.ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వడ్ల నవీన్ కుమార్ దౌల్తాబాద్ ఏఎంసీ చైర్మన్ గొల్లపల్లి కనకయ్య చేగుంట గ్రామ సర్పంచ్ సండ్రు స్రవంతి సతీష్ వడియారం గ్రామ సర్పంచ్ అంకన్న సాయికుమార్ గౌడ్ ,మార్కెట్ కమిటీ డైరెక్టర్ కురుమ లక్ష్మి , అన్నం ఆంజనేయులు, చేగుంట ఉపసర్పంచ్ మహమ్మద్ రఫీ,యువ నాయకుడు సండ్రుగు శ్రీకాంత్, పద్మా రెడ్డి, ప్రసాద్ రెడ్డి,ఇందిరమ్మ కమిటీ సభ్యులు కార్యకర్తలు ఆగం, రాకేష్, సంతోష్, నరేష్, శ్రీను,తదితరులు పాల్గొన్నారు.