📄 ePaper
Friday, September 11, 2026
ADS
Homepatancheru political newsఅనాథ యువకుడికి అండగా నిలిచిన పట్లోళ్ల ఉపేందర్ రెడ్డి-చికిత్స కోసం...

అనాథ యువకుడికి అండగా నిలిచిన పట్లోళ్ల ఉపేందర్ రెడ్డి-చికిత్స కోసం రూ. 10,000 ఆర్థిక సాయం అందజేత

📰 Generate e-Paper Clip

అమీన్‌పూర్,ఆగస్టు,19,మెదక్ టుడే) న్యూస్: ప్రతినిధి.తల్లిదండ్రులు లేక తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఓ అనాథ యువకుడికి బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు పట్లోళ్ల ఉపేందర్ రెడ్డి పెద్ద మనసుతో అండగా నిలిచారు.సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శశి అనే యువకుడి దీనస్థితి తెలుసుకున్న ఉపేందర్ రెడ్డి చలించిపోయారు. అమ్మానాన్నలు లేకపోవడంతో పాటు ఆసుపత్రి ఖర్చులకు ఇబ్బంది పడుతున్న ఆ యువకుడి వైద్య చికిత్స నిమిత్తం తన వంతుగా ₹10,000/- (పది వేల రూపాయల) ఆర్థిక సహాయాన్ని అందజేశారు.ఆపదలో ఉన్న తమను మానవతా దృక్పథంతో ఆదుకున్నందుకు యువకుడి కుటుంబ సభ్యులు, బంధువులు పట్లోళ్ల ఉపేందర్ రెడ్డికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేశారు. ఆయన సేవా గుణాన్ని పలువురు స్థానికులు ప్రశంసించారు.

RELATED ARTICLES
- Advertisment -ADS

Most Popular