📄 ePaper
Tuesday, March 10, 2026
ADS
HomePOITICAL NEWSఇందిరమ్మ రాజ్యం రైతుల పేదల పక్షపాతం కాంగ్రెస్ ప్రభుత్వం. ఎమ్మెల్యే...

ఇందిరమ్మ రాజ్యం రైతుల పేదల పక్షపాతం కాంగ్రెస్ ప్రభుత్వం. ఎమ్మెల్యే రోహిత్..

📰 Generate e-Paper Clip

•ఇందిరమ్మ రాజ్యం రైతుల పేదల పక్షపాత ప్రభుత్వం…

•మహిళా ఆర్థిక అభివృద్ధి ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుంది..

పాపన్నపేట,నవంబర్,25,మెదక్ టుడే న్యూస్:

పాపన్నపేట మండలంలోని మంగళవారం పొడిచాన్ పల్లి
రైతు వేదికలో స్వయం సహాయక సంఘాలకు వడ్డీ లేని రుణాల చెక్కుల పంపిణీ చేసిన ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావుఈసందర్భంగా మాట్లాడుతూ, ఇందిరమ్మ రాజ్యం రైతుల పేదల పక్షపాత ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని, రాష్ట్ర ప్రభుత్వం మహిళలు అన్ని రకాలుగా అభివృద్ధి సాధించేందుకు ఉచిత బస్సు ప్రయాణంతోపాటు, గ్యాస్ సబ్సిడీ, సన్న బియ్యం, ఉచిత కరెంటు, వడ్డీ లేని రుణాలు ,ఇందిరా మహిళ శక్తి చీరలు,తదితర సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నదని తెలిపారు. ఇల్లు లేని నిరుపేదలకు 5 లక్షల రూపాయలతో ఇందిరమ్మ ఇండ్లు ఇస్తున్నదని, వీటన్నిటిని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు.ఈ వడ్డీ లేని రుణాలతో మహిళల్లో ఒక ధైర్యం, నమ్మకం, ఆత్మ విశ్వాసం ఏర్పడిందని అన్నారు.మహిళలు ఒకేపనికి పరిమితం కాకుండా, అని రంగాల్లో అభివృద్ధి చెందాలని, మహిళల పేరు మీదనే కల్యాణ లక్ష్మి, ఇందిర మహిళా శక్తి చీరల వంటి పథకాలు అందిస్తుందన్నదని తెలిపారు.అదనపు కలెక్టర్ నగేష్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం మహిళల కోసం ఎన్నో అభివృద్ధి సంక్షేమ పథకాలను చేపడుతుందని వాటిని సద్వినియోగం చేసుకోవాలన్నారు.వడ్డీ లేని రుణాల రాయితీ కింద 30 కోట్ల 50 లక్షలుచెక్కును అందజేశారు. అనంతరం ప్రత్యేకంగా 11 వేల మహిళా స్వయం సహాయక సంఘ సభ్యులకు 8.89 కోట్లు వడ్డీరాయితీఅందించామన్నారు.మహాలక్ష్మి పథకం కింద 04 కోట్ల మంది మహిళలు ఉచిత ప్రయాణం చేయగా 100 కోట్ల రూపాయలు మహిళలు లబ్ధి పొందడం జరిగిందన్నారు.అలాగే గృహ జ్యోతి పథకం కింద ఉచిత విద్యుత్ సౌకర్యం పై 28 కోట్ల 65 లక్షల రూపాయలు లబ్ధిదారుల జీరో అకౌంట్ లో జమ చేయడం జరిగిందన్నారు.ఈకార్యక్రమంలో పాపన్నపేట ఎంపీడీవో విష్ణువర్ధన్, ఎంపీ ఓ శ్రీశైలం ,ఏపీఎం రాజు, పాపన్నపేట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గోవింద నాయక్, ప్రభాకర్ రెడ్డి, నరేందర్ గౌడ్, శ్రీకాంత్ అప్ప, ఇతర ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ADS

Most Popular

Recent Comments