📄 ePaper
Saturday, May 9, 2026
ADS
HomePOITICAL NEWSమత్స్యకారులు ఆర్థికంగా ఎదగాలికార్మిక గనుల శాఖ మాత్యులు వివేక్ వెంకటస్వామి..

మత్స్యకారులు ఆర్థికంగా ఎదగాలికార్మిక గనుల శాఖ మాత్యులు వివేక్ వెంకటస్వామి..

📰 Generate e-Paper Clip

•మత్స్యకారులు ఆర్థికంగా ఎదగాలి
కార్మిక గనుల శాఖ మాత్యులు వివేక్ వెంకటస్వామి

మెదక్,నవంబర్,22,మెదక్ టుడే న్యూస్:ప్రతినిధి

మత్స్య కార్మికులు ఆర్థికంగా ఎదగాలని కార్మిక గనుల శాఖ మాత్యులు వివేక్ వెంకటస్వామి అన్నారు.నర్సాపూర్ నియోజకవర్గంలోనీ రాయరావ్ చెరువులో ఉచిత చేప పిల్లల పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నర్సాపూర్ శాసన సభ నియోజకవర్గ పరిదిలోని (108) మత్స్య పారిశ్రామిక సహకార సంఘములలో గల (5668) సభ్యులకు జీవనోపాది కలుగుట వలన వారి యొక్క జీవన ప్రమాణాలు మెరుగు పడతాయన్నారు. మత్స్య కార్మికులు ఆర్థికంగా బలోపేతమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఈ చెరువులో 93,500 ల వేల చేప పిల్లలను విడుదల చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్, గ్రంథాలయ చైర్మన్ సుహాసిని రెడ్డి, నర్సాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ ఆవుల రాజిరెడ్డి, ఫ్యాక్స్ చైర్మన్లు, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ADS

Most Popular

Recent Comments