📄 ePaper
Monday, September 14, 2026
ADS
HomeTS.Policeపోలీసు అమరుల త్యాగాలు చిరస్మరణీయం.

పోలీసు అమరుల త్యాగాలు చిరస్మరణీయం.

📰 Generate e-Paper Clip

నక్సల్స్‌ దాడిలో అమరులైన ఐదుగురు పోలీసులకు ఘన నివాళి

పాపన్నపేట,సెప్టెంబర్,13,మెదక్ టుడే న్యూస్:
విధి నిర్వహణలో ప్రాణాలు అర్పించిన పోలీసు అమరుల త్యాగాలు చిరస్మరణీయమని పాపన్నపేట ఎస్సై శ్రీనివాస్ గౌడ్ అన్నారు. 1999 సెప్టెంబర్ 13న పాపన్నపేట పోలీస్‌స్టేషన్‌పై జరిగిన నక్సల్స్‌ దాడిలో అమరులైన పోలీసులను ఆదివారం స్మరించుకున్నారు.పోలీస్‌స్టేషన్‌ ఆవరణలోని అమరవీరుల స్థూపం వద్ద పోలీసు అధికారులు, సిబ్బంది పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు.నాటి దాడిలో హెడ్‌ కానిస్టేబుల్‌ రఘునందన్‌తో పాటు కానిస్టేబుళ్లు అబిద్‌ హుస్సేన్‌, ప్రసాద్‌, నర్సింలు, రాంచందర్‌ వీరమరణం పొందారు.వారి త్యాగాలను స్మరించుకుంటూ అమరవీరుల కుటుంబ సభ్యులను పోలీస్‌స్టేషన్‌లో ఘనంగా సన్మానించారు.ఈసందర్భంగా ఎస్సై శ్రీనివాస్‌ గౌడ్‌ మాట్లాడుతూ..విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన పోలీసుల సేవలు, త్యాగాలు ఎప్పటికీ మరువలేనివన్నారు.ప్రజల రక్షణ కోసం ప్రాణాలను సైతం లెక్కచేయకుండా విధులు నిర్వర్తించిన అమరవీరుల త్యాగాలు పోలీసు శాఖకు ఎల్లప్పుడూ స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.ఈకార్యక్రమంలో ఏఎస్సై తుక్కయ్య, కానిస్టేబుళ్లు అనిల్‌, నాగలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ADS

Most Popular