పోలీసు అమరుల త్యాగాలు చిరస్మరణీయం.
నక్సల్స్ దాడిలో అమరులైన ఐదుగురు పోలీసులకు ఘన నివాళి పాపన్నపేట,సెప్టెంబర్,13,మెదక్ టుడే న్యూస్: విధి నిర్వహణలో ప్రాణాలు అర్పించిన పోలీసు అమరుల త్యాగాలు చిరస్మరణీయమని పాపన్నపేట ఎస్సై శ్రీనివాస్ గౌడ్ అన్నారు. 1999 సెప్టెంబర్ 13న పాపన్నపేట పోలీస్‌స్టేషన్‌పై జరిగిన నక్సల్స్ దాడిలో అమరులైన పోలీసులను ఆదివారం స్మరించుకున్నారు.పోలీస్‌స్టేషన్ ఆవరణలోని అమరవీరుల స్థూపం వద్ద పోలీసు అధికారులు, సిబ్బంది పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు.నాటి దాడిలో హెడ్ కానిస్టేబుల్ రఘునందన్‌తో పాటు కానిస్టేబుళ్లు అబిద్ హుస్సేన్, ప్రసాద్, నర్సింలు, రాంచందర్ వీరమరణం పొందారు.వారి త్యాగాలను స్మరించుకుంటూ...