📄 ePaper
Friday, July 31, 2026
ADS
HomeUncategorizedశ్రీ ఏడుపాయల వనదుర్గ భవాని అమ్మవారిని దర్శించుకున్న ప్రముఖ సినీ...

శ్రీ ఏడుపాయల వనదుర్గ భవాని అమ్మవారిని దర్శించుకున్న ప్రముఖ సినీ నటుడు మంచు విష్ణు

📰 Generate e-Paper Clip

మెదక్ టుడే న్యూస్ జూలై 18: మెదక్ జిల్లా రిపోర్టార్ ప్రముఖ సినీ నటుడు మంచు విష్ణు శనివారం మెదక్ జిల్లా పాపన్నపేట మండలంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీ ఏడుపాయల వనదుర్గ భవాని అమ్మవారి దేవస్థానాన్ని భక్తిశ్రద్ధలతో దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న ఆయనకు అర్చకులు వేదమంత్రాల నడుమ పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు.అనంతరం అమ్మవారికి ప్రత్యేక పూజలు, అర్చనలు నిర్వహించి, దేవి అనుగ్రహం కోసం మంచు విష్ణు ప్రత్యేకంగా ప్రార్థనలు చేశారు. పూజల అనంతరం ఆలయ అర్చకులు ఆయనకు వేదాశీర్వచనాలు అందజేసి, తీర్థ ప్రసాదాలు సమర్పించారు. ఆలయ విశిష్టత, ఆధ్యాత్మిక ప్రాధాన్యత గురించి కూడా వివరించారు.మంచు విష్ణు ఆలయంలో కొంతసేపు గడిపి అమ్మవారి ఆశీస్సులు పొందారు. ఆయన రాక సందర్భంగా ఆలయ పరిసరాల్లో భక్తులు ఆసక్తిగా వీక్షించగా, అధికారులు అవసరమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టారు.ఈ కార్యక్రమంలో మెదక్ అడిషనల్ కలెక్టర్ నగేష్, పోలీసు అధికారులు, పోలీసు సిబ్బంది, దేవస్థానం ఈవో మరియు సిబ్బంది, టూరిజం శాఖ అధికారులు, టూరిజం సిబ్బంది, ఆలయ అర్చకులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ADS

Most Popular