📄 ePaper
Wednesday, September 16, 2026
ADS
Homeedupayala vanadhurgamma.TSఏడుపాయల హుండీ ఆదాయం రూ.65.89 లక్షలు.

ఏడుపాయల హుండీ ఆదాయం రూ.65.89 లక్షలు.

📰 Generate e-Paper Clip


పాపన్నపేట,జులై,3,(మెదక్ టుడే న్యూస్)పాపన్నపేట ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ ఏడుపాయల వనదుర్గా భవాని దేవస్థానంలో శుక్రవారం హుండీ లెక్కింపు చేపట్టారు. ఆలయ కార్యనిర్వహణాధికారి మఠం వీరేశం పర్యవేక్షణలో జరిగిన ఈకార్యక్రమంలో దేవాదాయ శాఖ మెదక్ జిల్లా ఇన్స్ పెక్టర్ రంగారావు,మెదక్ ఇండియన్ బ్యాంక్ సిబ్బంది,కరీంనగర్ శ్రీ వెంకట అన్నమాచార్య సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు. గడిచిన 77 రోజులకు గాను హుండీల ద్వారా రూ.65,89,200 నగదు ఆదాయం సమకూరింది. అలాగే 38 గ్రాముల మిశ్రమ బంగారం మరియు (1,230 కిలోల) మిశ్రమ వెండి వెండి కూడా లభించినట్లు అధికారులు వెల్లడించారు. హుండీ లెక్కింపు కార్యక్రమంలో ఆలయ సిబ్బంది,పాపన్నపేట పోలీస్ సిబ్బంది,శ్రీ వెంకట అన్నమాచార్య సేవా సమితి సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ADS

Most Popular