📄 ePaper
Friday, June 5, 2026
ADS
HomeNews1976 డైరెక్ట్ రిక్రూట్ ఎస్సైల అపూర్వ కలయిక.

1976 డైరెక్ట్ రిక్రూట్ ఎస్సైల అపూర్వ కలయిక.

📰 Generate e-Paper Clip

మాసబ్ ట్యాంక్ పోలీస్ ఆఫీసర్స్ మెస్‌లో ఆత్మీయ స్నేహ సమ్మేళనం.

(స్పెషల్ కరస్పాండెంట్)హైదరాబాద్,మే,17,మెదక్ టుడే న్యూస్:
1976లో డైరెక్ట్ రిక్రూట్ ఎస్సైలుగా ఎంపికై అనంతపూర్ పీటీసీలో కలిసి శిక్షణ పొందిన మాజీ పోలీసు అధికారులు, హైదరాబాద్‌లోని మాసబ్ ట్యాంక్ పోలీస్ ఆఫీసర్స్ మెస్‌లో ఆప్యాయంగా కలుసుకుని పాత జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. రిటైర్డ్ డి.ఎస్.పి. యోహాన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ స్నేహ సమ్మేళనం ఎంతో ఆత్మీయంగా, ఆనందభరితంగా సాగింది.ఇటీవల అనంతపూర్‌లో గోల్డెన్ జూబ్లీ వేడుకలు ఘనంగా నిర్వహించుకున్న అనంతరం, యోహాన్ కుమారుడు రాహుల్ వివాహ సందర్భంగా తన సహచర మిత్రులకు ప్రత్యేక విందు ఏర్పాటు చేశారు. విజయ్ సింగ్ నేతృత్వంలో జరిగిన ఈ సమావేశానికి రిటైర్డ్ డిఎస్పి పిఎస్‌ఎస్‌పీ ప్రసాద్ బాబు, రిటైర్డ్ అడిషనల్ ఎస్పీ రామ్ కిషన్, రిటైర్డ్ అడిషనల్ ఎస్పీ రాజయ్య, రిటైర్డ్ అడిషనల్ ఎస్పీ నరసింహులు తదితరులు హాజరై స్నేహ బంధాలను మరింత బలోపేతం చేసుకున్నారు.ఈ సందర్భంగా రామ్ కిషన్ మాట్లాడుతూ,స్నేహానికి మించిన సంపద లేదు. ఐదు దశాబ్దాలు గడిచినా మన మధ్య ఉన్న అనుబంధం మరింత బలపడటం ఆనందంగా ఉంది. ఇలాంటి కలయికలు జీవితానికి కొత్త ఉత్సాహాన్ని ఇస్తాయి” అని పేర్కొన్నారు.విజయ్ సింగ్ మాట్లాడుతూ,ట్రైనింగ్ రోజుల జ్ఞాపకాలు, అప్పటి అనుభవాలు ఈరోజు మళ్లీ కళ్లముందు తిరిగాయి. అందరం వివిధ హోదాల్లో పనిచేసి రిటైర్ అయినా మన స్నేహం మాత్రం ఎప్పటికీ చెదరలేదు” అని తెలిపారు.
యోహాన్ మాట్లాడుతూ,అనంతపూర్ పీటీసీలో మొదలైన మన స్నేహ ప్రయాణం ఇప్పటికీ ఇంత బలంగా కొనసాగుతుండటం ఎంతో గర్వంగా ఉంది. కుటుంబ సభ్యుల్లా కలిసి ఉండటం జీవితంలో గొప్ప వరం” అని అన్నారు.ఈ కార్యక్రమంలో ప్రముఖ సామాజికవేత్త, సీనియర్ పాత్రికేయుడు, ప్రముఖ దంత వైద్యుడు డాక్టర్ కొమ్ము వెంకన్న బాబు* పాల్గొనడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఆయన మాట్లాడుతూ,50 సంవత్సరాల తర్వాత కూడా ఇంతటి ఆత్మీయతతో, పరస్పర ప్రేమాభిమానాలతో కలుసుకోవడం నిజంగా ఆదర్శప్రాయం. సమాజంలో ప్రతి ఒక్కరూ ఇలాంటి మానవ సంబంధాలను, స్నేహ బంధాలను కాపాడుకోవాలి” అనిఅభిప్రాయపడ్డారు.కార్యక్రమం మొత్తం హాస్య సంభాషణలు, పాత అనుభవాల చర్చలు, ట్రైనింగ్ రోజుల జ్ఞాపకాలతో సందడిగా సాగింది. ఎన్నో ఏళ్ల తర్వాత కలుసుకున్న మిత్రులు ఆనందంతో ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకుంటూ, భవిష్యత్తులో కూడా తరచూ ఇలాంటి గెట్‌టుగెదర్‌లు నిర్వహించుకోవాలని నిర్ణయించుకున్నారు.

RELATED ARTICLES
- Advertisment -ADS

Most Popular