1976 డైరెక్ట్ రిక్రూట్ ఎస్సైల అపూర్వ కలయిక.
మాసబ్ ట్యాంక్ పోలీస్ ఆఫీసర్స్ మెస్‌లో ఆత్మీయ స్నేహ సమ్మేళనం. (స్పెషల్ కరస్పాండెంట్)హైదరాబాద్,మే,17,మెదక్ టుడే న్యూస్:1976లో డైరెక్ట్ రిక్రూట్ ఎస్సైలుగా ఎంపికై అనంతపూర్ పీటీసీలో కలిసి శిక్షణ పొందిన మాజీ పోలీసు అధికారులు, హైదరాబాద్‌లోని మాసబ్ ట్యాంక్ పోలీస్ ఆఫీసర్స్ మెస్‌లో ఆప్యాయంగా కలుసుకుని పాత జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. రిటైర్డ్ డి.ఎస్.పి. యోహాన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ స్నేహ సమ్మేళనం ఎంతో ఆత్మీయంగా, ఆనందభరితంగా సాగింది.ఇటీవల అనంతపూర్‌లో గోల్డెన్ జూబ్లీ వేడుకలు ఘనంగా నిర్వహించుకున్న అనంతరం, యోహాన్ కుమారుడు రాహుల్ వివాహ సందర్భంగా తన...