📄 ePaper
Tuesday, March 10, 2026
ADS
Homepatancheru political newsకేసీఆర్‌కు బర్త్‌డే గిఫ్ట్‌గా 5 మున్సిపాలిటీల విజయం: ఎర్రోళ్ల శ్రీనివాస్,...

కేసీఆర్‌కు బర్త్‌డే గిఫ్ట్‌గా 5 మున్సిపాలిటీల విజయం: ఎర్రోళ్ల శ్రీనివాస్, ఆదర్శ్ రెడ్డి.

📰 Generate e-Paper Clip

•కాంగ్రెస్ కుట్రలను చిత్తు చేసిన ప్రజలు: బీఆర్ఎస్ నేతల వెల్లడి

•అభివృద్ధికి పట్టం కట్టిన పటాన్‌చెరు నియోజకవర్గం

రామచంద్రాపురం,ఫిబ్రవరి,16,మెదక్ టుడే న్యూస్:ప్రతినిధి,పటాన్‌చెరు నియోజకవర్గంలోని ఐదు మున్సిపాలిటీల్లో బీఆర్ఎస్ సాధించిన ఘన విజయాన్ని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజు కానుకగా అంకితం ఇస్తున్నట్లు బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్‌చార్జ్ ఆదర్శ్ రెడ్డి, రాష్ట్ర ఎస్సీ/ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ ప్రకటించారు. ఆర్‌సీ పురంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో వారు మాట్లాడారు.
ఈ సందర్భంగా ఎర్రోళ్ల శ్రీనివాస్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ని అప్రజాస్వామిక చర్యలకు పాల్పడినా ప్రజలు బీఆర్ఎస్‌కే పట్టం కట్టారని అన్నారు. 420 హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్, ఇప్పటివరకు ఒక్క హామీని కూడా నెరవేర్చలేదని విమర్శించారు. కౌన్సిలర్లను కిడ్నాప్ చేయడం వంటి చర్యలు ప్రజాస్వామ్యానికి విరుద్ధమని, అవినీతిపై అభివృద్ధి సాధించిన విజయమిదని పేర్కొన్నారు.హరీశ్ రావు మార్గదర్శకత్వంలో విజయం:
ఆదర్శ్ రెడ్డి మాట్లాడుతూ.ఐదు మున్సిపాలిటీల్లో గులాబీ జెండా ఎగరడం సంతోషకరమని, ఈ విజయానికి మార్గదర్శనం చేసిన మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావుకు కృతజ్ఞతలు తెలిపారు. ఎర్రోళ్ల శ్రీనివాస్ సమన్వయంతో, కార్యకర్తల కృషితో ఈ ఫలితం సాధ్యమైందని చెప్పారు. ప్రత్యేకించి ఇస్నాపూర్ మున్సిపాలిటీ విజయం కీలకమని ఆయన అభివర్ణించారు.ఇంద్రేశం: గోసుల శ్రీనివాస్ యాదవ్, మెట్టు కుమార్ యాదవ్.
గుమ్మడిదల: పట్నం మాణిక్యం, గోవర్ధన్ రెడ్డి, తోంట అంజయ్య యాదవ్.గడ్డపోతారం: ఎమ్మెల్సీ శంభిపూర్ రాజు, బాలు రెడ్డి, కాటా రాజు.ఇస్నాపూర్: ఎర్రోళ్ల శ్రీనివాస్, శ్రీకాంత్ గౌడ్, సోమి రెడ్డి, కుమార్ గౌడ్, విష్ణు వర్ధన్, పృథ్వీ రాజ్, సంపత్.జిన్నారం: పాల సాయిరాం, వెంకటేష్ గౌడ్, అమీన్పూర్ మాజీ కౌన్సిలర్ శ్రీనివాస్ రెడ్డి, మాణిక్ యాదవ్.ఈ సమావేశంలో గోసుల శ్రీనివాస్ యాదవ్, పటాన్‌చెరు మాజీ జెడ్పీటీసీ శ్రీకాంత్ గౌడ్, పట్నం మాణిక్యం, బాలు రెడ్డి, గుమ్మడిదల మండల అధ్యక్షుడు ప్రభాకర్ రెడ్డి, కుమార్ గౌడ్, జగన్నాథ్ రెడ్డి తదితర నాయకులు పాల్గొన్నారు. విజయం కోసం కృషి చేసిన కార్యకర్తలకు, సహకరించిన మీడియా ప్రతినిధులకు ఆదర్శ్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -ADS

Most Popular

Recent Comments