చేగుంట, ఫిబ్రవరి,1, మెదక్ టుడే న్యూస్:చేగుంట పట్టణంలోని గ్రామ పంచాయతీ నూతన పాలకవర్గం బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు అదే స్వచ్ఛప్రగతి ఈ కార్యక్రమం గ్రామ సర్పంచ్ మరియు పాలకవర్గం అధ్వర్యంలో శ్రీకారం చేయడం జరిగింది ఈ స్వచ్ఛప్రగతి ప్రతి నెల 01 వ తేదీ మరియు 15 వ తేదీ నాడు చేగుంట పట్టణంలో మక్కారాజు పేట రోడ్ లో ఉన్న డా: అంబేద్కర్ విగ్రహం వద్ద నుండి స్వచ్ఛప్రగతి కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది అని గ్రామ సర్పంచ్ సండ్రుగు స్రవంతి సతీష్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ సండ్రుగు స్రవంతి సతీష్,ఉప్ప సర్పంచ్ మహ్మద్ రఫీ,వార్డు సభ్యులు వంశీ,యేలామేశ్వర్ ,సుఖేందర్, ఉదయ్ రాజు, మహ్మద్ అరీఫ్,తలారి లింగం,కట్ట శ్రీనివాస్ ,ఆంజనేయులు, శ్రీనివాస్,విష్ణు, శ్రీకాంత్ , గడియలు ప్రసాద్,దశరథ్ తదితరులు పాల్గొన్నారు.

