📄 ePaper
Sunday, April 19, 2026
ADS
Homeతెలంగాణ భక్తిసాయిబాబా కాలనీలో శివాలయం ప్రాంగణంలో పర్ణశాల నిర్మాణానికి భూమి పూజ.

సాయిబాబా కాలనీలో శివాలయం ప్రాంగణంలో పర్ణశాల నిర్మాణానికి భూమి పూజ.

📰 Generate e-Paper Clip

(స్పెషల్ కరస్పాండెంట్)
షాద్‌నగర్,ఏప్రిల్,12, మెదక్ టుడే న్యూస్:
షాద్‌నగర్ మున్సిపల్ పరిధిలోని ఆరో వార్డు సాయిబాబా కాలనీలో ఉన్న శివాలయం ప్రాంగణంలో పర్ణశాల మరియు రెండు గదుల నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమం ఆదివారం ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమాన్ని శివాలయ పూజారి రమామహేశ్వర్ అయ్య ఆధ్వర్యంలో నిర్వహించగా, కాలనీ అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు మంగ శంకర్ (ఏఎస్సీజీ), ప్రధాన కార్యదర్శి బొబ్బిలిగామ శ్రీనివాసులు దంపతులు పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు.కార్యక్రమంలో కాలనీ కోశాధికారి షాప్ శ్రీశైలం, సమన్వయకర్త డాక్టర్ కొమ్ము వెంకన్న బాబు, గౌరవ అధ్యక్షుడు ఏ. ఆంజనేయులు గౌడ్, మాజీ అధ్యక్షులు బెన్నూరి చంద్రయ్య, అమర్నాథ్ రెడ్డి, బోర్వెల్ శ్రీరాములు గౌడ్, మాంకాల వెంకటయ్య (బ్యాంక్), టీఆర్ఎస్ పార్టీ యువ నాయకుడు, మాజీ ప్రధాన కార్యదర్శి, 21వ వార్డు కౌన్సిలర్ ఎస్.పి. శివ, విశ్రాంత ఉపాధ్యాయుడు మందారం నరసింహులు, శివరాజు, రిటైర్డ్ ఆర్టీసీ ఉద్యోగి బాలస్వామి, కంటెస్టెడ్ కౌన్సిలర్ రాజాసింగ్ (టిప్పర్ రాజు), రామిరెడ్డి, పవన్ కుమార్ (బోల్ట్) తదితరులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా కాలనీ అధ్యక్షుడు మంగ శంకర్ మాట్లాడుతూ, దాతల సహకారం మరియు కాలనీ వాసుల సమిష్టి కృషితో పర్ణశాల నిర్మాణం త్వరితగతిన పూర్తి చేయాలని, అందరూ సహకరించాలని కోరారు.
ఈ కార్యక్రమం కాలనీ పెద్దలు, ప్రముఖుల సమక్షంలో విజయవంతంగా నిర్వహించబడింది.

RELATED ARTICLES
- Advertisment -ADS

Most Popular

Recent Comments