•గురువారంపాపన్నపేటలోనిసాయిబాబా ఆలయ16వ వార్షికోత్సవం:ఆలయ పూజారి విశ్వనాథ శర్మ..
పాపన్నపేట,నవంబర్,25, మెదక్ టుడే న్యూస్:
మండల కేంద్రమైన పాపన్నపేటలోనీ గురువారం సాయిబాబా ఆలయ 16వ వార్షికోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు ఆలయ పూజారి చెరువుపల్లి విశ్వనాథ శర్మ ఓక ప్రకటనలో తెలిపారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉదయం 08.00గం.కు గణపతి పూజ, పాలతో అభిషేకం అనంతరం రమ సమెత సత్యనాయణ స్వామీ వ్రతం, మధ్యానం హారతి కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.అనంతరం రామారపు వీరేశం గుప్తా దంపతులచే అన్న ప్రసాదాలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఈకార్యక్రమానికి భక్తులు అధిక సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు.
