📄 ePaper
Sunday, September 13, 2026
ADS
Homepapannapeta -TSపాపన్నపేటలో ‘హర్ ఘర్ తిరంగా’ సన్నాహక సమావేశం.

పాపన్నపేటలో ‘హర్ ఘర్ తిరంగా’ సన్నాహక సమావేశం.

📰 Generate e-Paper Clip

వివిధ మోర్చాలకు నూతన అధ్యక్షుల నియామకం

పాపన్నపేట,ఆగస్టు,10,మెదక్ టుడే న్యూస్:రాష్ట్ర,జిల్లా బీజేపీ శాఖల ఆదేశాల మేరకు పాపన్నపేట మండలం కొత్తపల్లిలో సోమవారం‘హర్ ఘర్ తిరంగా’ సన్నాహక సమావేశాన్ని మండల అధ్యక్షుడు వడ్ల సంతోష్ చారి ఆధ్వర్యంలో నిర్వహించారు.ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర ఓబీసీ మోర్చా కార్యవర్గ సభ్యుడు గడ్డం కాశీనాథ్ చేతుల మీదుగా బీజేపీ వివిధ మోర్చాల నూతన అధ్యక్షులకు నియామక పత్రాలు అందజేశారు.మహిళా మోర్చా అధ్యక్షురాలిగా మన్నె సుమలత, ఓబీసీ మోర్చాకు వడ్ల బాగేష్, యువ మోర్చాకు కేరూరి జగదీష్, కిసాన్ మోర్చాకు జిన్నా గోపాల్, ఎస్సీ మోర్చాకు బాబు, ఎస్టీ మోర్చాకు పాతలోత్ వెంకట్ నాయక్‌లను నియమించారు.ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగురవేసి దేశభక్తిని చాటాలని నాయకులు పిలుపునిచ్చారు.ఆగస్టు 12న పాపన్నపేటలో నిర్వహించనున్న తిరంగా ర్యాలీని విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ADS

Most Popular