📄 ePaper
Saturday, September 19, 2026
ADS
HomeNewsముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కును పంపిణీ చేసిన బిజెపి నాయకులు.

ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కును పంపిణీ చేసిన బిజెపి నాయకులు.

📰 Generate e-Paper Clip

చేగుంట, మే, 9, మెదక్ టుడే న్యూస్:చేగుంట మండలం, మెదక్ పార్లమెంట్ సభ్యులు మాధవనేని రఘునందన్ రావు ఆదేశానుసారం మండలంలోని చందాయిపేట గ్రామానికి చెందిన లబ్ధిదారుడు బండ రాజు కి మంజూరైన ముఖ్యమంత్రి సహాయ నిధి ( సీఎంఆర్ఎఫ్ ) చెక్కును శనివారం బిజెపి నాయకులు అందజేశారు. అనారోగ్య కారణాలతో చికిత్స పొందిన రాజు ఆర్థిక సాయం కోసం దరఖాస్తు చేసుకోగా, ఎంపీ చొరవతో ఈ నిధులు మంజూరయ్యాయి. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. ఆపదలో ఉన్న పేదలకు ప్రభుత్వం అందించే సహాయ నిధి ఎంతో భరోసానిస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో చేగుంట మండల బిజెపి ప్రధాన కార్యదర్శి జూకంటి శోభన్, చందాయిపేట బూత్ బిజెపి అధ్యక్షుడు బుడ్డ రమేష్, బిజెపి ప్రధాన కార్యదర్శి శిలబలిష్, మాజీ బూత్ అధ్యక్షుడు వంశీ గౌడ్, ఉపాధ్యక్షుడు శాలిపేట స్వామి, సంఘని రాజు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ADS

Most Popular