📄 ePaper
Saturday, May 9, 2026
ADS
Homecollector MEDAKరైతులకు ఇబ్బందులు లేకుండా యాసంగి వారి ధాన్యము కొనుగోలు చేపట్టాలి.రాష్ట...

రైతులకు ఇబ్బందులు లేకుండా యాసంగి వారి ధాన్యము కొనుగోలు చేపట్టాలి.రాష్ట పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తం కుమార్ రెడ్డి.

📰 Generate e-Paper Clip


మెదక్,మే,4, మెదక్ టుడేన్యూస్:ప్రతినిధి,రైతులకు ఎలాంటి ఇబ్బందులు యాసంగి వరి ధాన్యము కొనుగోలు చేయాలనీ రాష్ట పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తo కుమార్ రెడ్డి అన్నారు. సోమవారం హైదరాబాద్ లోని రాష్ట సచివారయం నుండి అన్ని జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, పౌర సరఫరాల శాఖ అధికారులతో నిర్వహించిన విడియో కాన్ఫరెన్స్ కార్యక్రమానికి మంత్రులు పొన్నం ప్రబాకర్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, వాకిటి శ్రీహరి, దుద్దిలా శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ కుమార్, రాష్ట ప్రభుత్వ ప్రధాన కార్య దర్శి రామకృష్ణా రావు, పౌర సరఫరాల శాఖ కమిషనర్ స్టిఫెన్ రవీంద్ర, రవాణా శాఖ కమిషన్ ఇలంబర్తి తో కలిసి రాష్ట పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తం కుమార్ రెడ్డి విడియో విడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్టంలో అకాల వర్షాలు కురుస్తున్నందున కొనుగోలు కేంద్రాలలో రక్షణ చర్యలు తీసుకోవాలన్నారు. కొనుగోలు కేంద్రాలలో సరిపడా టార్పలిన్ కవర్లు, అందుబాటులో వుండేలా చర్యలు తీసుకోవాలన్నారు. తక్కువ సమయంలో ఎక్కువ వర్షం కురుస్తున్నందున రైతులు తమ ధాన్యం కుప్పలను ఎత్తు ప్రాంతంలో ఉంచుకోవాలన్నారు. గాలులకు టార్పాలిన్ కవర్లు ఎగిరి పోతున్నాయని రైతులు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అధికారులు వాతావరణ శాఖ హెచ్చరికలను రైతులకు తెలియ జేయలన్నారు. కొనుగోలు కేంద్రాలలో రైతులకు ఇబ్బందులు లేకుండా త్రాగు నీరు, షామియానా, ఓ ఆర్ ఎస్, ప్యాకెట్లు అందుబాటులో వుండేలా చర్యలు తీసుకోవాలన్నారు. మైచర్ యంత్రాలు ఆటో మేటిక్ ప్యాడి క్లెనర్ లు అందుబాటులో ఉంచాలన్నారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని కేటాయించిన రైస్ మిల్లులకు పంపించాలన్నారు. ఎక్కడ కుడా జాప్యం, చేయకుడదన్నారు. హమిలిలు, వాహనాల కొరత రాకుండా సర్దుబాటు చేసుకోవాలన్నారు. ప్రతి కొనుగోలు కేంద్రాలకు గ్రామ స్థాయి అధికారులు మండల స్థాయి అధికారులు పర్య వేక్షించాలన్నారు. మే నెల చివరి కల్లా 80% ధాన్యము కొనుగోళ్ళు పూర్తి చేయాలన్నారు. జిల్లా కేంద్రంలోని సమీకృత కలెక్టరేట్ భవన సముదాయంలోని విడియో కాన్ఫరెన్స్ హాలులో నిర్వహించిన విడియో కాన్ఫరెన్స్ కార్యక్రమానికి కలెక్టర్ ప్రతిమా సింగ్, అదనపు కలెక్టర్ నగేష్ వివిధ శాఖ అధికారులతో కలిసి పాల్గొన్నారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో అన్ని కేంద్రాల్లో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందని కొనుగోలు కేంద్రాలలో రైతులకు ఇబ్బందులు లేకుండా పూర్తి స్థాయి ఏర్పాట్లు చేయడం జరుగుతుందని కొనుగోలు కేంద్రంలో మైచర్ యంత్రం, ఆటో మేటిక్ ప్యాడి క్లేనర్స్ అందుబాటులో ఉంచాలన్నారు. ప్రతి కొనుగోలు కేంద్రానికి 100 చొప్పున టార్పలిన్ కవరు అందించాలన్నారు. ఎండ తీవ్రత దృష్ట్యా కొనుగోలు కేంద్రాలలో అవసరమైన ఏర్పాట్లు చేయాలన్నారు. హమాలీల కొరత, వాహనాల కొరత లేకుండా స్థానికంగా వున్నా హమాలిలను ,వాహానాలను సర్దు బాటు చేసుకోవాలన్నారు. చివరి గింజ వరకు కొనుగోలు చర్యలు తిసుకుంటామన్నారు. తూకం వేసిన ధాన్యాన్ని వెంటనే కేటాయించిన రైస్ మిల్లులకు తరలించాలన్నారు. ఎక్కడ కుడా జాప్యం జరుగకూడదన్నారు. సమన్వయంతో పని చేసి యాసంగి వరి ధాన్యం కొనుగోలు పూర్తీ చేయాలన్నారు. ఎక్కడ నిర్లక్ష్యం వహించాకుదన్నారు.
ఈ విడియో కాన్ఫరెన్స్ లో రవాణశాఖ మార్కెటింగ్ శాఖ , పౌర సరఫరాల శాఖ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ADS

Most Popular

Recent Comments