📄 ePaper
Friday, April 17, 2026
ADS
Homecollector MEDAKప్రజాపాలన ద్వారా ప్రభుత్వ పథకాలను ప్రతి అర్హులైన లబ్ధిదారులకు చేరవేయడం...

ప్రజాపాలన ద్వారా ప్రభుత్వ పథకాలను ప్రతి అర్హులైన లబ్ధిదారులకు చేరవేయడం మండల సభల ప్రధాన లక్ష్యం- జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్

📰 Generate e-Paper Clip

మెదక్,ఏప్రిల్,16,మెదక్ టుడే న్యూస్:ప్రతినిధి

ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా మెదక్ జిల్లా కొల్చారం మండలం లో గురువారం మండల స్థాయి సమావేశం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ ముఖ్య అతిథిగా హాజరై, జయ జయ హే తెలంగాణ రాష్ట్ర గీతంతో కార్యక్రమాన్ని ప్రారంభించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రజాపాలన కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పథకాలను ప్రతి అర్హులైన లబ్ధిదారులకు చేరవేయడం ప్రధాన లక్ష్యమని తెలిపారు. గ్రామ స్థాయిలో సమస్యలను గుర్తించి తక్షణ పరిష్కారం అందించే దిశగా అధికారులు కృషి చేయాలని సూచించారు. ప్రజలు తమ సమస్యలను నిర్భయంగా తెలియజేయాలని, ప్రభుత్వం అందిస్తున్న సేవలను సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.మండల సమావేశంలో లేవనెత్తిన సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు సంబంధిత అధికారులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. ప్రజల నుండి వచ్చిన ప్రతి విజ్ఞప్తిని ప్రాధాన్యంగా పరిగణించి, నిర్ణీత కాలంలో పరిష్కారం చూపించాలని సూచించారు.గ్రామ స్థాయిలో ఎదురవుతున్న తాగునీరు, రహదారులు, విద్యుత్, ఇతర మౌలిక వసతుల సమస్యలను వెంటనే గుర్తించి తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా సమర్థవంతమైన సేవలను అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు.ప్రతి గ్రామంలో కనీసం పది మంది రైతులతో ఆయిల్ పామ్ సాగుపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. ఆయిల్ పామ్ పంట ద్వారా రైతులకు అధిక ఆదాయం లభించే అవకాశాలు ఉన్నాయని, ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలను వినియోగించుకోవాలని కోరారు.రైతులకు అవసరమైన సాంకేతిక సూచనలు, శిక్షణలు అందిస్తూ ఆయిల్ పామ్ సాగును ప్రోత్సహించడంలో గ్రామ స్థాయి ప్రజాప్రతినిధులు గ్రామాల అభివృద్ధిలో కీలక పాత్ర పోషించాలని తెలిపారు. ప్రభుత్వ పథకాలను ప్రజలకు సమర్థవంతంగా చేరవేయడంతో పాటు, ప్రతి ఇంటికి అవగాహన కల్పించే బాధ్యత సర్పంచ్‌లపై ఉందన్నారు.ఆయిల్ పామ్ వంటి లాభదాయక పంటలపై రైతులకు ప్రోత్సాహం కల్పించి, వ్యవసాయ రంగ అభివృద్ధికి తోడ్పడాలని ఆయన పేర్కొన్నారు.అనంతరం మండల సమాఖ్య సభ్యురాలు మాట్లాడుతూ మహిళా సంఘాల బలోపేతం, స్వయం ఉపాధి అవకాశాల పెంపు, గ్రామీణ అభివృద్ధిలో సంఘాల పాత్ర గురించి వివరించారు. ప్రభుత్వం అందిస్తున్న సహాయంతో మహిళలు ఆర్థికంగా ముందుకు సాగుతున్నారని పేర్కొన్నారు.ఇందిరమ్మ లబ్ధిదారులు మాట్లాడుతూ ప్రభుత్వం అందిస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా తమకు స్థిరమైన నివాసం కలగడం ఎంతో సంతోషకరమని తెలిపారు. ఇంతకాలం ఎదుర్కొన్న గృహ సమస్యలకు శాశ్వత పరిష్కారం లభించిందని, తమ కుటుంబాలకు భద్రతతో కూడిన జీవనం అందిందని పేర్కొన్నారు. ప్రభుత్వం తమలాంటి పేదలకు ఇల్లు కల్పించడం ద్వారా జీవన ప్రమాణాలు మెరుగుపడుతున్నాయని కృతజ్ఞతలు తెలిపారు.అలాగే సంబంధిత అధికారులు పథకం అమలులో పారదర్శకతను పాటిస్తూ అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రయోజనం చేకూరేలా చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు.ఈ కార్యక్రమంలో తాసిల్దార్ శ్రీనివాసాచారి ప్రత్యేక అధికారి జిల్లా విద్యాశాఖ అధికారి విజయ, ఎంపీడీవో, రఫీక్ ఉన్నిసా బేగం సర్పంచ్ . శేఖర్,.వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ADS

Most Popular

Recent Comments