📄 ePaper
Tuesday, September 22, 2026
ADS
Homepatancheru political newsటీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ని కలిసిన కాట...

టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ని కలిసిన కాట శ్రీనివాస్ గౌడ్.

📰 Generate e-Paper Clip

పటాన్‌చెరు మార్కెట్ కమిటీ నియామకంపై కృతజ్ఞతలు.. చైర్మన్‌గా శివానందం బాధ్యతల స్వీకారం

పటాన్‌చెరు,మార్చి,26,(మెదక్ టుడే) న్యూస్:ప్రతినిధి.తెలంగాణ రాష్ట్ర టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ని పటాన్‌చెరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి కాట శ్రీనివాస్ గౌడ్ మర్యాదపూర్వకంగా కలిశారు. పటాన్‌చెరు వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన పాలక మండలిని నియమించినందుకు, ముఖ్యంగా చైర్మన్‌గా శివానందం ని ఎంపిక చేసినందుకు మహేష్ కుమార్ గౌడ్ కి ఈ సందర్భంగా ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం టీపీసీసీ అధ్యక్షులను శాలువాతో ఘనంగా సన్మానించారు.

కార్యకర్తలకు సముచిత స్థానం – మహేష్ కుమార్ గౌడ్:

ఈ సందర్భంగా టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ నూతన కమిటీని ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు:

“కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడి పనిచేసే ప్రతి కార్యకర్తకు, నాయకుడికి సముచిత స్థానం దక్కుతుంది. పటాన్‌చెరు మార్కెట్ కమిటీకి నియమితులైన శివానందం మరియు ఇతర సభ్యులు రైతుల సంక్షేమమే ధ్యేయంగా పనిచేయాలి. ప్రభుత్వ ఫలాలను సామాన్యులకు చేరవేయడంలో మార్కెట్ కమిటీలు కీలక పాత్ర పోషించాలి. నియోజకవర్గంలో కాట శ్రీనివాస్ గౌడ్ నాయకత్వంలో పార్టీ మరింత బలోపేతం కావాలని ఆకాంక్షిస్తున్నాను.”

రైతు పక్షపాతిగా పనిచేస్తాం – కాట శ్రీనివాస్ గౌడ్:

కాట శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. పటాన్‌చెరు ప్రాంత రైతుల సమస్యల పరిష్కారానికి నూతన మార్కెట్ కమిటీ నిరంతరం కృషి చేస్తుందని తెలిపారు. సమర్థుడైన నాయకుడు శివానందం ని చైర్మన్‌గా నియమించినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి, మహేష్ కుమార్ గౌడ్ కి ధన్యవాదాలు తెలిపారు.ఈ కార్యక్రమంలో పటాన్‌చెరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, నందిగామ సర్పంచ్ విక్రం గౌడ్, సుధాకర్ గౌడ్, గోపాల్,కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ADS

Most Popular