📄 ePaper
Friday, September 18, 2026
ADS
HomePOITICAL NEWSచేగుంట శ్రీ వెంకటేశ్వర స్వామి దూప ద్వీప నైవేద్యానికి ప్రతినెల...

చేగుంట శ్రీ వెంకటేశ్వర స్వామి దూప ద్వీప నైవేద్యానికి ప్రతినెల 8100 రూపాయలు ఉప సర్పంచ్ మహమ్మద్ రఫీక్.

📰 Generate e-Paper Clip

నేను పదవిలో ఉన్నంతకాలం ప్రతి నెల 8,100 ఇస్తాను ఉపసర్పంచ్.

చేగుంట,ఫిబ్రవరి,1,మెదక్ టుడే న్యూస్:చేగుంట మండల కేంద్రంలో ని శ్రీ వెంకటేశ్వర స్వామిని ఉప సర్పంచ్ మహమ్మద్ రఫీ క్ దర్శించుకున్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీ వెంకటేశ్వర స్వామి దూప ద్వీప నైవేద్యానికి ప్రతి నెల 8100 రూపాయలు అందిస్తానని చెప్పారు. వెంకటేశ్వర స్వామికి నేను ఉప సర్పంచ్ గా ఉన్నంతకాలం ప్రతి నెల ఒకటవ తారీఖు నాడు ఎనిమిది వేల ఒక వంద రూపాయలు ఇస్తాను అని హామీ ఇచ్చారు. ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పంతులు వాసుదేవ శర్మ, ఉపసర్పంచ్ రఫీ,శంకర్,శేఖర్,తదితరులు పాల్గొన్నారు

RELATED ARTICLES
- Advertisment -ADS

Most Popular