📄 ePaper
Tuesday, March 10, 2026
ADS
HomeSportపోలీస్ జర్నలిస్టుల మధ్య స్నేహపూర్వక క్రికెట్ మ్యాచ్ జిల్లా ఎస్...

పోలీస్ జర్నలిస్టుల మధ్య స్నేహపూర్వక క్రికెట్ మ్యాచ్ జిల్లా ఎస్ పి శ్రీ డి.వి. శ్రీనివాస రావు, ఐపీఎస్.

📰 Generate e-Paper Clip

•పోలీస్ జర్నలిస్టుల మధ్య స్నేహపూర్వక క్రికెట్ మ్యాచ్  జిల్లా ఎస్ పి శ్రీ డి.వి. శ్రీనివాస రావు, ఐపీఎస్..

మెదక్,నవంబర్,16,మెదక్ టుడే న్యూస్:ప్రతినిధి

ఆదివారం మెదక్ జిల్లా ఎస్ పి శ్రీ డి.వి. శ్రీనివాస రావు, ఐపీఎస్ ఆధ్వర్యంలో జిల్లా పోలీసు సిబ్బంది మరియు జర్నలిస్టుల మధ్య స్నేహపూర్వక క్రికెట్ మ్యాచ్‌ను నిర్వహించారు.ఈ కార్యక్రమంలో రెండు జట్లూ ఉత్సాహంతో పాల్గొని క్రీడాస్పూర్తిని ప్రదర్శించాయి.మ్యాచ్ ప్రారంభానికి ముందుగా రెండు జట్లు గ్రౌండ్‌కు చేరుకున్నాయి. మొదట టాస్ గెలిచిన జర్నలిస్టుల జట్టు కెప్టెన్ నరేష్ గారు బ్యాటింగ్ ఎంచుకుంన్నారు. ప్రతిభావంతమైన షాట్లతో జర్నలిస్టుల జట్టు 15.5 ఓవర్లలో 101 పరుగులు 10 వికెట్లు కోల్పోయారు.తదుపరి ఇన్నింగ్స్‌లో 102 పరుగుల లక్ష్య ఛేదనలో భాగంగా పోలీస్ జట్టు క్రమబద్ధంగా రన్స్ సాధిస్తూ ముందుకు సాగింది. 2 వికెట్లు మాత్రమే కోల్పోయి, 11.4 ఓవర్లలో లక్ష్యాన్ని చెదించగలిగింది. చివరి పరుగును స్వయంగా జిల్లా ఎస్పీ శ్రీ డి.వి. శ్రీనివాస రావు, ఐపీఎస్ చేసి జట్టుకు విజయాన్ని అందించారు.

మ్యాచ్‌లో అత్యధిక పరుగులు చేసిన నరేష్ ఆర్‌ఎస్ఐకి “మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్” బహుమతిని, రన్నరప్‌గా నిలిచిన జర్నలిస్టుల జట్టుకు, విన్నర్‌గా నిలిచిన పోలీస్ జట్టుకు జిల్లా ఎస్ పి శ్రీనివాస రావు ఐపీఎస్ మరియు మెదక్ ఎమ్మెల్యే బహుమతులను అందజేశారు.

జిల్లా ఎస్ పి ఈ సందర్బంగా మాట్లాడుతూ, క్రీడలు శారీరక ఆరోగ్యానికి, మానసిక ప్రశాంతతకు, జట్టు భావన అభివృద్ధికి ఎంతగానో దోహదపడతాయని అన్నారు. పోలీస్-మీడియా సంబంధాలు మరింత బలోపేతం కావడానికి ఇలాంటి స్నేహపూర్వక కార్యక్రమాలు కొనసాగుతాయని తెలిపారు. అదేవిధంగా భవిష్యత్తులో మెదక్ పోలీస్ కార్యాలయం ప్రాంగణంలో అత్యాధునిక ప్రమాణాలతో ఏర్పాటు చేస్తున్నా క్రికెట్ గ్రౌండ్ ను అతి త్వరలో ఒక అంతర్జాతీయ క్రికెట్ ప్లేయర్ తో ప్రారంభింప చేస్తామన్నారు. జిల్లా యువత కు ఉచిత క్రికెట్ కోచింగ్ క్యాంపు లు నిర్వహించే విధంగా కృషి చేస్తామన్నారు. భవిష్యత్తులో ఇలాంటి మరిన్ని స్నేహపూర్వహక మ్యాచ్ లు నిర్వహిస్తామని ఎస్ పి తెలిపారు.ఈ ప్రెండ్లీ మ్యాచ్ కార్యక్రమంలో మెదక్ అదనపు ఎస్ పి శ్రీ. ఎస్ మహేందర్, మెదక్ డియస్ పి ప్రసన్న కుమార్, తూప్రాన్ డియస్ పి నరేందర్ గౌడ్, ఏఆర్ డియస్ పి రంగా నాయక్, సీఐ లు వెంకట రాజా గౌడ్, రాజా శేఖర్ రెడ్డి, జర్జ్, ఆర్ఐ లు శైలందర్, రామకృష్ణ, ప్రెస్ క్లబ్ అధ్యక్షులు నరేష్ గౌడ్, జర్నలిస్ట్ మిత్రులు, పోలీస్ సిబ్బంది పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ADS

Most Popular

Recent Comments