ప్రతి సోమవారం ఎంపీడీవో కార్యాలయాల్లో నిర్వహణ.
మెదక్,ఆగస్టు,16,మెదక్ టుడే న్యూస్:ప్రజల సమస్యలను స్థానికంగానే పరిష్కరించేందుకు ప్రతి సోమవారం అన్ని మండలాల ఎంపీడీవో కార్యాలయాల్లో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ తెలిపారు. మండల ప్రజలు తమ సమస్యలు, వినతుల దరఖాస్తులను మండల స్థాయిలో నిర్వహించే ప్రజావాణిలో అందజేయాలని సూచించారు.ప్రజావాణికి అన్ని శాఖల మండలస్థాయి అధికారులు సకాలంలో హాజరుకావాలని కలెక్టర్ ఆదేశించారు. మండల స్థాయిలో స్వీకరించిన దరఖాస్తులను సంబంధిత అధికారులు పరిశీలించి ఆన్లైన్ పోర్టల్లో నమోదు చేయాలని సూచించారు. ప్రజల సౌకర్యార్థం ఈ కార్యక్రమాన్ని మండల స్థాయిలోనే నిర్వహిస్తున్నందున సమస్యల పరిష్కారం కోసం జిల్లా కేంద్రానికి రావాల్సిన అవసరం లేదని కలెక్టర్ స్పష్టం చేశారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

