(స్పెషల్ కరస్పాండెంట్)
గోవా-హైదరాబాద్,మే,10,మెదక్ టుడే న్యూస్:నేషనల్ హ్యూమన్ రైట్స్ అండ్ సోషల్ జస్టిస్ కమిషన్ ( ఎన్ హెచ్ ఆర్ ఎస్ జె .సి) గోవా రాష్ట్ర అధ్యక్షుడిగా శ్రీ ఆనంద్‌ను నియమిస్తూ సంస్థ జాతీయ ఇంచార్జ్, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు సర్వేందర్ ఆధ్వర్యంలో నియామక పత్రం మరియు అధికారిక ఐడీ కార్డును ఘనంగా అందజేశారు. ఈ కార్యక్రమం ఆయన సోదరుడి కుమార్తె వివాహ వేడుక సందర్భంగా నిర్వహించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.ఈ కార్యక్రమంలో కేంద్ర కమిటీ సభ్యులు డాక్టర్ సుక్కా డానియల్, దామోదర్ గుప్తా , పి.ఎల్. రవీందర్ నాయుడు, కె.పి. శ్రీనివాస్, యాదవ రెడ్డి, అశోక్ కుమార్ ముదిరాజ్ పాల్గొని ఆనంద్‌కు శుభాకాంక్షలు తెలిపారు. అలాగే రాష్ట్ర సభ్యులు రాజేందర్ నల్లారి, శ్రీమతి ప్రీతి, శ్రీమతి లత, గోవా రాష్ట్ర అధ్యక్షుడిగా నియమితులైన ఆనంద్ సతీమణి శ్రీమతి అపర్ణ, శ్రీమతి ఉషా నాయుడు మరియు సంస్థ అధికార ప్రతినిధి డాక్టర్ కొమ్ము వెంకన్నబాబు హాజరయ్యారు.ఈ సందర్భంగా మాట్లాడిన నూతన గోవా రాష్ట్ర అధ్యక్షుడు ఆనంద్, వచ్చే నెలలో గోవాలో రాష్ట్ర కార్యాలయాన్ని ప్రారంభించి, కొత్త కమిటీని ఏర్పాటు చేసి సంస్థ సేవలను విస్తృత స్థాయిలో ప్రజలకు అందిస్తామని తెలిపారు. మానవ హక్కులు, సామాజిక న్యాయం కోసం కృషి చేయడమే తమ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు.అదే విధంగా గోవా లో జరుగ బోయే కార్యక్రమానికి తన సోదరి పార్వతి, మరియు తన బావ గారైన విజయ కుమార్ నాయుడు పూర్తి స్థాయిలో సహకరించి కార్యక్రమాన్ని విజయవంతం చేయబోతున్నట్లుగా ఆనంద్ తెలిపారు.
సంస్థ అభివృద్ధికి అందరి సహకారం అవసరమని జాతీయ ఇంచార్జ్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు సర్వేందర్ పేర్కొంటూ, గోవాలో సంస్థను మరింత బలోపేతం చేయాలని ఆకాంక్షించారు.
ఎన్ హెచ్.ఆర్.ఎస్. జె.సి. గోవా అధ్యక్షుడిగా ఆనంద్ నియామకంవివాహ వేడుక వేదిక గా నియామక పత్రం, ఐడి కార్డ్ అందజేత.
