
అమీన్పూర్,ఫిబ్రవరి,20,(మెదక్ టుడే) న్యూస్:ప్రతినిధి.సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు నియోజకవర్గం పరిధిలోని అమీన్‌పూర్ జిహెచ్ఎంసి పరిధిలోని సాయి అంబికా కాలనీలో నూతనంగా ఏర్పాటు చేసిన ‘రాజన్న టీ కొట్టు’ ను పటాన్‌చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి ప్రారంభించారు. అమీన్‌పూర్ మున్సిపల్ మాజీ చైర్మన్ తుమ్మల పాండురంగా రెడ్డి తో కలిసి ఆయన ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొని, నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, యువత స్వయం ఉపాధి దిశగా అడుగులు వేయడం అభినందనీయమని, స్థానిక వ్యాపారాలకు ప్రజలందరూ ప్రోత్సాహం అందించాలని పిలుపునిచ్చారు. మాజీ చైర్మన్ తుమ్మల పాండురంగా రెడ్డి మాట్లాడుతూ, కాలనీ వాసులకు నాణ్యమైన సేవలు అందించాలని నిర్వాహకులను కోరారు.ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు మరియు సీనియర్ నాయకులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు:
మాజీ ఎంపీపీ దేవానందం
మాజీ కౌన్సిలర్ కల్పన ఉపేందర్ రెడ్డి, కొల్లూరు చంద్రకళ గోపాల్
మాజీ కో-ఆప్షన్ సభ్యులు తల్లారి రాములు,సీనియర్ నాయకులు నర్సింగ్ రావు, తుమ్మల ప్రతాప్ రెడ్డి, శ్రీనివాస్
యువ నాయకులు తుమ్మల రుష్వంత్ రెడ్డి, ఈర్ల శ్రీకాంత్, అమీన్పూర్ యువకులు, ఈ కార్యక్రమంలో టీ కొట్టు నిర్వాహకులు, కాలనీ వాసులు మరియు ఇతర ముఖ్య నాయకులు పాల్గొన్నారు. ప్రారంభోత్సవం అనంతరం ఎమ్మెల్యే మరియు ఇతర నేతలు స్వయంగా టీ రుచి చూసి నిర్వాహకులను అభినందించారు.


