వివాహానికి రావాలని ఎమ్మెల్యే సునీత రెడ్డికి ఆహ్వానం.

కౌడిపల్లి,మే,29,మెదక్ టుడే న్యూస్:శుభకార్యానికి రావాలని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత రెడ్డికి ఆహ్వానం అందించారు. కౌడిపల్లి మండలం, రాజిపేట గ్రామానికి చెందిన వార్డ్ మెంబర్ మహమ్మద్ జాఫర్ కుమారుడి పెళ్లికి రావాలని హైదరాబాద్ లోని సునీత రెడ్డి క్యాంపు కార్యాలయంలో పెళ్లి పత్రికను సుతా లక్ష్మారెడ్డికి అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఉప సర్పంచ్ ఉరట్ల మాధవి శివ, రైతు సమన్వయ అధికారి గణేష్ గౌడ్, యాద గౌడ్, బాబు, తోళ్ల శ్రీనివాస్ ఉన్నారు.