MEDAK TODAY
Newspaper Banner
Date of Publish : 16 September 2026, 12:35 pm Digital Edition : SHIVA KUMAR

వినాయకుడి సన్నిధిలో స్నేహ యూత్ అన్నదానం.

వినాయకుడి సన్నిధిలో స్నేహ యూత్ అన్నదానం

మూడో రోజు పూజల సందర్భంగా భక్తులకు అన్నప్రసాద వితరణ

పాపన్నపేట,సెప్టెంబర్,16, మెదక్ టుడే న్యూస్:
మండల కేంద్రమైన పాపన్నపేటలోని కుమ్మరిగైన పోచమ్మ గుడి వద్ద వినాయక చవితి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా మూడో రోజు పూజలను పురస్కరించుకుని బుధవారం స్నేహ యూత్ ఆధ్వర్యంలో వినాయక మందిరం వద్ద అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా భక్తులకు అన్నప్రసాదాన్ని పంపిణీ చేశారు.పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని అన్నప్రసాదాన్ని స్వీకరించారు.భక్తులకు సేవ చేయడం ఆనందంగా ఉందని నిర్వాహకులు తెలిపారు.ఈకార్యక్రమంలో స్నేహ యూత్ అధ్యక్షుడు బెస్త ప్రసాద్, ఉపాధ్యక్షుడు ఉప్పరి యోగేష్, క్యాషియర్ రఘుపతి గంగాధర్, సలహాదారు శాంతపురం కిరణ్, యూత్ సభ్యులు భూపతి హనుమంతు, బెస్త శ్రీశైలం, బెస్తలాలు, రంగంపేట రాజేష్ తదితరులు పాల్గొన్నారు.