విద్యుత్ ఘాతంతో పాడిగేదె మృతి,ఆదుకోవాలని పేద రైతు ఆవేదన.
చేగుంట,జూన్,26,మెదక్ టుడే న్యూస్:చేగుంట మండలం, వడియారం గ్రామ పరిధిలో కరెంట్ షాక్ తగిలి ఒక పాడి గేదె అక్కడికక్కడే మృతి చెందినది.గ్రామానికి చెందిన పేద రైతు వెల్దుర్తి ఎల్లంకి చెందిన గేదె పొలం వద్ద మేతకు వెళ్లిన సమయంలో ప్రమాదవశాత్తు విద్యుత్ ఘాతానికి గురైంది.కుటుంబానికి జీవనాధారమైన గేదె కళ్లముందే ప్రాణాలు విడవడంతో యజమాని ఎల్లం కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.ఈ ప్రమాదం వల్ల ఆ పేద రైతుకు భారీ ఆర్థిక నష్టం వాటిల్లింది. విద్యుత్ శాఖ అధికారులు తక్షణమే స్పందించి, బాధిత రైతు కుటుంబానికి...