పాపన్నపేట,ఫిబ్రవరి,26,మెదక్ టుడే న్యూస్:పాపన్నపేట మండలంలోని నామపూర్ గ్రామానికి చెందిన రైతు నర్సింహులు ప్రమాదవశాస్తూ విద్యుత్ షాక్ తో పొలం వద్ద బుధవారం మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న మాజీ డిప్యూటీ స్పీకర్, బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షాలు ఏం పద్మ దేవేందర్ రెడ్డి గురువారం నామాపూర్ గ్రామానికి చేరుకొని నర్సింలు కుటుంబాన్ని పరామర్శించి మనోధైర్యాన్ని తెలిపారు. ఈ సందర్భంగా విద్యుత్ షాక్ తో నరసింహులు మృతి చెందడం చాలా బాధాకరమన్నారు.అనంతరం 5 వేలు రూపాయలు ఆర్థిక సాయంఅందజేశారు. టిఆర్ఎస్ నాయకులు మాజీ ఎంపీపీ సొంగు దుర్గయ్య, బాబా గౌడ్, వెంకటరెడ్డి, గురుమూర్తి గౌడ్, లింగారెడ్డి,తదితర నాయకులు పాల్గొన్నారు.