విద్యార్థులపై లాఠీచార్జ్ దారుణం-ప్రశ్నించే గొంతుకలను అణచొద్దు.
నీట్ లీకేజీపై పార్లమెంట్‌లో చర్చ జరపాలి. కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలి. మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్‌రెడ్డి. మెదక్,జూలై, 22,(మెదక్ టుడే న్యూస్ ప్రతినిధి) ఢిల్లీలో తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం శాంతియుతంగా నిరసన చేపట్టిన విద్యార్థులపై పోలీసులు లాఠీచార్జ్ చేయడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్‌రెడ్డి అన్నారు. ఈ ఘటనను తాను తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఒక ప్రకటనలో పేర్కొన్నారు.ప్రశ్నించే హక్కు ప్రతి పౌరుడికి భారత రాజ్యాంగం కల్పించిందని, ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే గొంతుకలను అణచివేయడం...