విధి నిర్వహణలో హెడ్‌ కానిస్టేబుల్‌ ఆనందం మృతి.

తూప్రాన్‌లో ఛాతినొప్పితో కుప్పకూలి.. మేడ్చల్‌లో చికిత్స పొందుతూ కన్నుమూత సహచరుల్లో విషాదం.. నేడు మల్కాపూర్‌లో అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు మెదక్,సెప్టెంబర్,8,మెదక్ టుడే న్యూస్:విధి నిర్వహణకు వెళ్లిన మెదక్‌ జిల్లా ఏఆర్‌ హెడ్‌క్వార్టర్స్‌ క్యూఆర్టీలో విధులు నిర్వహిస్తున్న హెడ్‌ కానిస్టేబుల్‌ ఆనందం (54) ఆకస్మికంగా మృతి చెందారు. మంగళవారం చెక్‌పోస్ట్‌ విధుల నిమిత్తం తూప్రాన్‌ వెళ్లిన ఆయనకు అక్కడ ఛాతినొప్పి రావడంతో ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లారు.వైద్యులు ఈసీజీ నిర్వహిస్తున్న సమయంలో ఒక్కసారిగా కుప్పకూలిపోవడంతో ఆస్పత్రి సిబ్బంది వెంటనే సీపీఆర్‌ చేశారు. పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన...