MEDAK TODAY
Newspaper Banner
Date of Publish : 26 September 2026, 4:59 am Digital Edition : SHIVA KUMAR

వందనపురి కాలనీ ఫేజ్-2లో ఘనంగా లడ్డూ వేలం పాట.

వందనపురి కాలనీ ఫేజ్-2లో ఘనంగా లడ్డూ వేలం పాట.

రూ.53,000కు గణపతి లడ్డూను దక్కించుకున్న వికాస్ రెడ్డి, వినయ్ రెడ్డి సోదరులు

విజేతలకు, వారి తండ్రికి పూలమాలలు, శాలువాలతో ఘన సత్కారం

అమీన్ పూర్, సెప్టెంబర్ 25:(మెదక్ టుడే) న్యూస్ ప్రతినిధి.సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు నియోజకవర్గం పరిధిలోని బీరంగూడ డివిజన్ వందనపురి కాలనీ ఫేజ్-2లో గణేష్ నవరాత్రి ఉత్సవాలు అత్యంత భక్తిశ్రద్ధలతో ముగింపు దశకు చేరుకున్నాయి. ఉత్సవాల్లో భాగంగా కాలనీ మండపంలో నిర్వహించిన గణపతి మహాప్రాసాదం (లడ్డూ) వేలం పాట భక్తుల జయజయధ్వానాల నడుమ అత్యంత ఉత్సాహభరితంగా సాగింది. ఈ వేలం పాటలో దోమ కవిత-శంకర్ రెడ్డి దంపతుల కుమారులు వెంకట్ వికాస్ రెడ్డి (పెద్ద కుమారుడు), వినయ్ రెడ్డి (చిన్న కుమారుడు) కలసి పోటీపడి రూ. 53,000కు స్వామివారి లడ్డూ ప్రసాదాన్ని దక్కించుకున్నారు.లడ్డూ గెలుచుకున్న అనంతరం ఉత్సవ కమిటీ సభ్యులు లడ్డూ విజేతలైన వికాస్ రెడ్డి, వినయ్ రెడ్డిలతో పాటు వారి తండ్రి శంకర్ రెడ్డిని పూలమాలలు వేసి, శాలువాతో ఘనంగా సత్కరించి గౌరవపూర్వకంగా స్వామివారి లడ్డూను అందజేశారు.ఈ సందర్భంగా లడ్డూను కైవసం చేసుకున్న వికాస్ రెడ్డి, వినయ్ రెడ్డి మాట్లాడుతూ… విఘ్నేశ్వరుని కృపాకటాక్షాలతో ప్రతి ఒక్కరూ సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలనే సంకల్పంతోనే వేలం పాటలో పాల్గొన్నట్లు తెలిపారు. “వందనపురి కాలనీ ఫేజ్-2 లోని స్వామివారి మహాప్రసాదాన్ని దక్కించుకోవడం మాకెంతో అదృష్టంగా, సంతోషంగా ఉంది.ఆగణనాథుని దివ్య ఆశీస్సులు మా కుటుంబంతో పాటు కాలనీ వాసులందరిపై ఎల్లప్పుడూ ఉండాలని, అందరికీ అంతా మంచే జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం” అని వారు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ నిర్వాహకులు, కాలనీ పెద్దలు, మహిళలు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజేతలను అభినందించారు. అనంతరం స్వామివారి నిమజ్జన శోభాయాత్ర వైభవంగా ప్రారంభమైంది.