వైభవంగా ప్రారంభమైన బొంతపల్లి వీరభద్రుడి బ్రహ్మోత్సవాలు.
గుమ్మడిదల,మార్చి,8,(మెదక్ టుడే) న్యూస్:ప్రతినిధి.సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు నియోజకవర్గం పరిధిలోని గుమ్మడిదల మండల పరిధిలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం బొంతపల్లిలో వెలసిన శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు ఆదివారం అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. ఆలయ ప్రాంగణం భక్తజన సందోహంతో, శివనామ స్మరణతో మారుమోగింది. ఘనంగా ధ్వజారోహణం - విశేష పూజలు బ్రహ్మోత్సవాల తొలిరోజైన ఆదివారం ఉదయం ఆలయ ఈవో శశిధర్ గుప్తా, ధర్మకర్తల మండలి చైర్మన్ ప్రతాప్ రెడ్డి దంపతుల ఆధ్వర్యంలో వేద పండితులు శాస్త్రోక్తంగా పూజా కార్యక్రమాలను నిర్వహించారు. గణపతి హోమం:...